స్వచ్ఛ భరత్ మిషన్ – పారిశుధ్యం నిర్వహణ లో జిల్లాకు టూ స్టార్

-ఇంటింటికి త్రాగునీటి కుళాయి కనెక్షన్లు ఏర్పాటు ద్వారా దేశంలో 21 వ స్థానంలో తూ. గో జిల్లా
-కలెక్టర్ మాధవీలత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఇంటింటికి త్రాగునీటి కుళాయి కనెక్షన్లు, పరిశుభ్రత పాటించడం ద్వారా తూర్పు గోదావరి జిల్లా కు జాతీయ స్థాయి లో లభించిన గుర్తింపు నిలపడం తో మరింత ప్రగతి దిశగా అడుగులు వేయాలని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత తెలిపారు.

మంగళవారం సాయంత్రం భారత ప్రభుత్వ త్రాగునీటి శాఖ జల్ జీవన్ మిషన్ కార్యదర్శి విన్నీ మహాజన్ దేశ వ్యాప్తంగా పలు జిల్లాల కలెక్టర్లతో అమరావతి నుంచి విడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్థానిక కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్, జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా జేసీ ఎన్.తేజ్ భరత్, కలెక్టరేట్ నుంచి ఆర్ ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ డి..బాలశంకరం, డ్వామా పిడి జి ఎస్. రామ్ గోపాల్, డివిజనల్ పంచాయతీ అధికారి జె.సత్యనారాయణ హాజరయ్యారు.

ఈ సందర్భంగా భారత ప్రభుత్వ త్రాగునీటి శాఖ జల్ జీవన్ మిషన్ కార్యదర్శి విన్నీ మహాజన్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాలలో త్రాగునీరు సరఫరా, పారిశుధ్యం కింద స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా చేపడుతున్న అభివృద్ధి పనులు కు కావలసిన నిధుల కేటాయింపు సిద్దంగా ఉన్నామని తెలిపారు. జాతీయ స్థాయి లో ఇంటింటికీ త్రాగునీరు సరఫరా చేసే విధానంలో తూర్పు గోదావరి జిల్లా 81 శాతం లక్ష్యాలను పూర్తి చేసి, దేశంలో 21 వ స్థానం దక్కించుకోవడం జరిగిందన్నారు. అదే విధంగా స్వచ్ఛ గ్రామాల అభివృద్ధి సూచిక లక్ష్య సాధనలో టూ స్టార్ రేటింగ్ ఇవ్వండం జరిగిందని తెలిపారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, తూర్పు గోదావరి జిల్లా కు చెంది 3.56 లక్షల గృహాలకు ఇంటింటి త్రాగునీటి కుళాయి కనెక్షన్లు ఇవ్వవలసి ఉండగా ఇప్పటి వరకు 2.89 లక్షల గృహాలకు ట్యాప్ కనెక్షన్ లు 81 శాతం ఇవ్వడం జరిగిందని అన్నారు. జిల్లాలో పెద్ద ఎత్తున జగనన్న ఇండ్ల కాలనీలో ఇండ్ల నిర్మాణాలు చేపట్టడం జరుగుతోందని, వాటికి అనుగుణంగా నూతన ప్రతిపాదనలు పంపడం జరుగుతుందని అన్నారు. అదే విధంగా జిల్లాలో తడి పొడి చెత్త సేకరణ ఘన, ద్రవ వ్యర్థ పదార్థాలకు చెంది వేస్ట్ మేనేజ్మెంట్ వ్యవస్థలను ఏర్పాటు చేసి, వాటిని ఆదాయ వనరుగా అభివృద్ధి చేయడం జరుగుతుందని అన్నారు. ఆ దిశలో పరిశ్రమలు, కంపెనీ లు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజల భాగస్వామ్యం తో వినూత్న ఆలోచనలకు సృజనాత్మకత జోడించి అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. ఇంటింటికి త్రాగు నీటి కుళాయి కనెక్షన్లు, గ్రామాల్లో పరిశుభ్రత పాటించడం లో భాగంగా డోర్ టూ డోర్ గార్బేజ్ సేకరణ చేస్తున్నట్లు తెలిపారు. లిక్విడ్ మేనేజ్మెంట్ కింద సోప్ పిట్స్, మ్యాజిక్ పిట్స్, లీచ్ పిట్స్ ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. స్వచ్ఛ భారత్ మిషన్ కింద పెద్ద ఎత్తున నిర్మాణాలు చేపడుతున్నట్లు, భవిష్యత్తులో మరిన్ని నిర్మాణాలు చేపట్టడం జరుగుతుందని అన్నారు. అందుకు అనుగుణంగా భారత్ ప్రభుత్వ జల్ జీవన్ మిషన్ కి ప్రతిపాదనలు పంపుతామని తెలిపారు. రానున్న రోజుల్లో దేశంలో మరింత మెరుగైన స్థానం కోసం అన్ని శాఖల అధికారులు సమిష్టి తత్వం తో కూడిన పని తీరు చూపాలని కలెక్టర్ మాధవీలత కోరారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *