-పంట ప్రారంభం లోనే రుణాలను మంజూరు చేయండి..
-జగనన్న తోడులో లక్ష్యాలను పూర్తి చేయండి..
-జగనన్న గృహ నిర్మాణాల రుణాల మంజూరుకు లబ్దిదారులకు సహకరించండి..
-జిల్లా కలెక్టర్‌ఎస్ డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఖరీఫ్‌కు రైతులు సమాయత్తం అవుతున్నందున పంట వేసే సమయంలోనే కౌలు రైతులకు రుణాలను అందించి సహకరించాలని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు బ్యాంకర్లను కోరారు.స్థానిక కలెక్టర్ విడిది కార్యాలయంలో సోమవారం జిల్లా కలెక్టర్ డిల్లీరావు అధ్యక్షతన జిల్లా స్థాయి సంప్రదింపుల కమిటీ (డిస్ట్రిక్ట్ కన్సల్టెటివ్ కమిటీ ` డిసిసి), జిల్లా స్థాయి సమీక్షా సమావేశం (డిఎల్‌ఆర్‌సి) బ్యాంకర్స్ సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న బ్యాంకులకు నిర్దేశించిన బుణ లక్ష్యాలను నేటి వరకు సాధించిన ప్రగతిని ఆయా బ్యాంకుల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ డిల్లీరావు సమీక్షించారు. సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్దిదారులకు బ్యాంకర్లు విరివిగా రుణాలను అందించి సహకరిస్తున్నారని ఇదే స్పూర్తిని గత ఈ ఏడాది కూడా కొనసాగించాలని కోరారు. ముఖ్యంగా వ్యవసాయ రంగానికి, స్వయం సహాయ సంఘాలకు నిర్దేశించిన లక్ష్యాల మేరకు సకాలంలో బుణాలను అందించి సహకరించాలని కోరారు. బుణ లక్ష్యాల మంజూరును నూరు శాతం సాధించి జిల్లా ప్రగతికి బ్యాంకర్లు తమ సహకారం అందించాలని కోరారు. ఈ ఏడాది ఖరీఫ్ సాగుకు రైతులు సమాయత్తం అవుతున్నందున పంట సాగు ప్రారంభంలోనే రైతులకు ముఖ్యంగా కౌలు దారుల రైతులకు రుణాలను అందించేందుకు బ్యాంకర్లు సహకరించాలన్నారు. జిల్లాలో 40 వేల మంది కౌలుదారుల రైతులు ఉన్నట్లు అంచనా వేశారని ఆయా కౌలుదారు రైతులకు బ్యాంకర్లకు నిర్థేశించిన రుణాలను అందించాలని కోరారు. అధికారులకు కూడా కౌలుదారు రైతులకు సంబంధించిన సమాచారాన్ని ముందుగా అందించాలన్నారు. సాగు ప్రారంభంలోనే రైతులకు అందించాలన్నారు. మనం ఇచ్చే రుణం పంట పైనే గాని భూమి పై కాదని విషయాన్ని భూ యజమానులకు తెలిపి ఒప్పించాలన్నారు.చిరువ్యాపారులకు ఆర్థిక సాయం అందించే జగనన్న తోడు పథకంలో లబ్దిదారులకు విరివిగా రుణాలను అందించాలని కోరారు. స్వయం సహాయక సంఘాల సభ్యులతో పాటు ఫుట్‌పాత్‌లపై వ్యాపారం నిర్వహించుకునే చిరువ్యాపారస్తులకు లబ్ది అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ఏడాది జిల్లాలో 20,557 చిరువ్యాపారస్తులకు రుణాలు మంజూరు లక్ష్యంగా నిర్థేశించామని వీటిలో 8,236 రూరల్ ప్రాంతంలోను, విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోని 10,848 తో పాటు జగ్గయ్యపేట, నందిగామ, తిరువూరు పట్టణ ప్రాంతాలలో 12,321 మంది గుర్తించిన చిరువ్యాపారస్థులకు పూర్తి స్థాయిలో రుణాలను అందించాలని కోరారు.నవరత్నాలు పేదలందరికి ఇళ్లు కార్యక్రమంలో భాగంగా స్వయం సహాయక సంఘాల మహిళలకు వివిధ కేటగిరిలలో గృహాలను నిర్మించుకునేందుకు అందించే ఆర్థిక సహాయ లక్ష్యాలను బ్యాంకర్లు పూర్తి చేయాలన్నారు. జిల్లాలో 7,536 మంది లబ్దిదారులకు 262 కోట్ల 34 లక్షల రూపాయల రుణ లక్ష్యానికి గాను 3,765 మంది లబ్దిదారులకు 92 కోట్ల రూపాయల చేశారని మిగిలినవి కూడా ముఖ్యంగా నగరపాలక సంస్థ పరిధిలో సంబంధిత బ్యాంకులు త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ డిల్లీరావు అన్నారు.ప్లానింగ్‌బోర్డు వైస్ చైర్మన్, శాసనసభ్యులు మల్లాదివిష్ణువర్థన్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి చిరువ్యాపారులకు అండగా ఉండే జగనన్న తోడు పథకంలో అసలైన లబ్దిదారుల ఎంపికకు అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రత్యేక డ్రైవ్ ద్వారా గుర్తించి డూప్లికేషన్ లేకుండా చూడాలన్నారు. చిరు వ్యాపారులకు, వడ్డీ వ్యాపారస్తుల నుండి రక్షణ కల్పించే జగనన్న తోడు పథకానికి, రుణాలు మంజూరు చేయడంలో కొన్ని బ్యాంకులు లబ్దిదారులను ఇబ్బందులు గురిచేస్తున్నాయన్నారు. నగరపాలక సంస్థ పరిధిలోనే పెండిరగ్ దరఖాస్తుల సంఖ్య ఎక్కువగా ఉందని వాటిని పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. నగరంలోని సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో స్వయం సహాయక సంఘాలు బ్యాంకుల లావాదేవీలు నిర్వహించుకునేందుకు 15 వేల మంది ఖాతాదారులు నగరం నుండి 8 కిలోమీటర్ల దూరంలోని కానూరు ఇండియన్ బ్యాంకుకు వెళ్ళవలసి ఉందని, సమీఫంలోనే మధురానగర్‌లో ఇండియన్ బ్యాంక్ బ్రాంచ్ ఏర్పాటు చేయాలని బ్యాంక్ అధికారుల దృష్టికి శాసనసభ్యులు తీసుకొచ్చారు.సమావేశంలో డిసిసి, కన్వినర్, యూనియన్ బ్యాంక్ డిప్యూటి జనరల్ మేనేజర్ మువ్వల శ్రీథర్, రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియాఎజియం యంజెడ్. రెహమాన్, నాబార్డ్ డిజియం మిళింద చౌసాల్కర్, ఎల్‌డియం ప్రియాంక, డిఆర్‌డిఏ పిడి కె.శ్రీనివాస్, యుసిడి పిడి శకుంతల, ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌సి డివి రమణ, హౌసింగ్ పిడి రజినీ కుమారి, వివిధ బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News