ప్రపంచ ఆరోగ్యం ఆనందం యోగాతోనే సాధ్యం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అంతర్జాతీయ యోగా ఉత్సవాలలో భాగంగా ఈరోజు విజయవాడ ఆయుర్వేద కాలేజి ఆవరణలో జరిగిన యోగాశక్తి చికిత్స మరియు హెల్త్ క్యాంప్ లో పాల్గొన్న యోగా శక్తి సాధన సమితి వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ మాకాల సత్యనారాయణ రేపటి ప్రపంచ ఆరోగ్యంగా ఆనందంగా వుండాలంటే యోగ సాధన తోనే సాధ్యమన్నారు.యోగ,ఆయుర్వేదం భారతదేశము యొక్క అతి పురాతన వైద్య విధానాలని,వీటిని అనేక క్లిష్ట పరిస్థితుల నుండి ఉపయోగించి విజయం సాధించారని.వీటిని అన్ని దేశాలు అవలంబించడంలో సర్వ మానవాళి రుగ్మతల బారిన పడకుండా ఉపయోగపడతాయని తెలిపారు. యోగాకి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమము ఆయుర్వేద కాలేజీ విద్యార్థులు స్టాప్ పాల్గొని సద్వినియోగం చేసుకున్నారు.విజయవాడ ఆయుర్వేద కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ సాయి సుధాకర్ జ్యోతి ప్రజ్వలన చేసి సభను ప్రారంభించినారు.ప్రతి ఒక్క విద్యార్థి ఆయుర్వేదంతో పాటు యోగ కూడా అలవరుచుకుని ప్రజలను చైతన్యం చేయవలసిందిగా కోరారు.యోగా గురువు జి కృష్ణ యోగాసనాల విశిష్టతను తెలిపి ప్రాక్టీస్ చేయించారు. ఆయుర్వేద కాలేజీ యాజమాన్యం ఈ సందర్భంగా డాక్టర్ మాకాల సత్యనారాయణ గారిని ,యోగా గురువు జి కృష్ణ ని సన్మానించారు. చైతన్య వందన సమర్పణ చేసినారు. పలువురికి హెల్త్ కప్ చేసి యోగా రికమెండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రములో మాచూరి శ్రీరామ్ మూర్తి, బాడపాటి ఉదయ్ కుమార్ సేవలు అందించినారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *