తెలుగు జాతి కీర్తిపతాక పీవీ నరసింహారావు

– రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దేశ ఆర్థిక వ్యవస్థను తన సంస్కరణలతో గాడిన పెట్టిన మహామేధావి పీవీ నరసింహారావు అని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. మాజీ ప్రధాని శ్రీ పాములపర్తి వేంకట నరసింహారావు 102వ జయంతిని పురస్కరించుకుని సత్యనారాయణపురంలోని శివాజీ కేఫ్ సెంటర్ వద్ద ఆ మహనీయుని చిత్రపటానికి స్థానిక కార్పొరేటర్ శర్వాణీ మూర్తితో కలిసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేశ సమగ్రాభివృద్ధికి ఆ మహనీయుడు అందించిన సేవలను స్మరించుకున్నారు. దేశంలో బలమైన ఆర్థిక వ్యవస్థకు పీవీ పునాదులు వేశారని ఈ సందర్భంగా మల్లాది విష్ణు కొనియాడారు. ఆయన బహుభాషా కోవిదుడని.. అసాధారణమైన ప్రతిభ, జ్ఞానం పీవీ సొంతమ‌ని కీర్తించారు. దేశ చరిత్రలో నిరంతర సంస్కరణ శీలిగా పీవీ నరసింహారావు చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. అంతర్గత భద్రత వ్యవహారాలు, విదేశాంగ వ్యవహారాల్లోనూ పీవీ అవలంభించిన దృఢమైన వైఖరి, దౌత్యనీతి.. దేశ సమగ్రతను, సార్వభౌమత్వాన్ని పటిష్ఠపరిచిందన్నారు. ఆర్థిక, విద్య, భూపరిపాలన తదితర రంగాలలో పీవీ నరసింహారావు ప్రవేశపెట్టి, అమలు చేసిన సంస్కరణల ఫలితాన్ని నేడు దేశ ప్రజలు అనుభవిస్తున్నారని మల్లాది విష్ణు పేర్కొన్నారు. ఆ మహనీయుని ఆశయాలను ముందుకు తీసుకెళ్లే దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. అలాగే భావితరాలు పీవీ సేవలను స్మరించుకునే విధంగా సత్యనారాయణపురంలో ఆయన కాంస్య విగ్రహ ఏర్పాటుకు సంకల్పించినట్లు మల్లాది విష్ణు వెల్లడించారు. అనంతరం మిఠాయిలు పంచిపెట్టారు. కార్యక్రమంలో డివిజన్ కోఆర్డినేటర్ దోనేపూడి శ్రీనివాస్, నాయకులు జంధ్యాల శంకర్, దమ్మాలపాటి చంద్రశేఖర్, శనగవరపు శ్రీను, చల్లా సుధాకర్, లంకా బాబు, మైలవరపు రామకృష్ణ, ఉప్పు రంగబాబు, చాంద్ శర్మ, కూనపులి ఫణి, పార్టీ శ్రేణులు, పీవీ అభిమానులు పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *