ముస్లిం మైనార్టీల అభ్యున్నతికి సీఎం జగన్ కృషి

 

– రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ముస్లిం మైనార్టీల అభివృద్ధి, సంక్షేమానికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని అజిత్ సింగ్ నగర్ షాదీఖానా ఈద్గా నందు ముస్లిం సోదరులతో కలిసి గురువారం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. రంజాన్‌ మాసం ముగిశాక రెండు నెలల తర్వాత వచ్చే అత్యంత ముఖ్యమైన పండుగ బక్రీద్‌ అని మల్లాది విష్ణు అన్నారు. త్యాగ నిరతికి, భక్తిభావానికి ప్రతీక అని తెలిపారు. ఈ పర్వదినాన ధనం, ఇష్టపడే ఆహార పదార్థాలు, వస్తువులను దానం చేయడం అనాదిగా వస్తోందన్నారు. పండుగను అందరూ భక్తిశ్రద్దలతో జరుపుకోవాలని.. ప్రార్థనల కోసం ఈద్గాలలో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ముస్లిం మైనార్టీలు అధికంగా నివసించే అజిత్ సింగ్ నగర్ పరిసర ప్రాంతంలో గతంలో తాను ఎమ్మెల్యేగా ఉండగానే ఈద్గాకు స్థలం కేటాయించడం జరిగిందని మల్లాది విష్ణు తెలిపారు. దీంతో ఏటా రంజాన్, బక్రీద్ వేళల్లో ముస్లిం సోదరులు ఈ ప్రాంతంలో ప్రార్థనలు నిర్వహించుకునేందుకు మార్గం సుగుమం అయిందన్నారు. అలాగే ఈద్గా పరిరక్షణతో పాటు ప్రార్థనలకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించడంలో భాగంగా రూ. 19.95 లక్షల వ్యయంతో ప్రహరీని నిర్మించి గేటు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు. ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే మత పెద్దలు తమ దృష్టికి తీసుకురావాలని.. పరిష్కరించేందుకు ఎల్లవేళలా తాము సిద్ధంగా ఉన్నట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా మైనార్టీ సోదరులకు మరోసారి హృదయపూర్వక బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో నాయకులు అఫ్రోజ్, పఠాన్ నజీర్ ఖాన్, షేక్ అలీ, ఎండి యాకూబ్, ఈద్గా కమిటీ అధ్యక్షులు షేక్ నాగూర్, కమిటీ సభ్యులు రసూల్, షేక్ వలి, రషీద్, జలీల్ ఖాన్, రహీం, షేక్ హామద్, ముస్లిం సోదరులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *