Breaking News

పోలవరం నిర్వాసితుల పునరావాసానికి అయ్యే మొత్తం ఖర్చు కేంద్రమే భరించాలి… : నేతి మహేశ్వర రావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సిపిఎం ఆధ్వర్యంలో జరిగిన పోలవరం పొలికేక మహాపాదయాత్రలో ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్ ఫోరమ్ అధ్యక్షుడు నేతి మహేశ్వర రావు పాల్గొనడం జరిగింది అలాగే విజయవాడ ధర్నా చౌక్ లో జరిగిన పాదయాత్ర ముగింపు కార్యక్రమం లో ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్ ఫోరమ్ అధ్యక్షుడు, ఛార్టర్డ్ అకౌంటెంట్ నేతి మహేశ్వర రావు మాట్లాడుతూ రాష్ట్ర రాజధాని అమరావతి కోసం రైతులు భుములిచ్చి పాదయాత్ర చేయటం అలాగే పోలవరం ప్రాజెక్ట్ కోసము సర్వం కోల్పోయి అడవి బిడ్డలు పాదయాత్రలు చేస్తుంటే ప్రజల సమస్యల మీద ఒక్క అఖిల పక్ష సమావేశం పెట్టిన చరిత్ర గత నాలుగు సంవత్సరాల్లో లేదు అంటే రాష్ట్రం లో ప్రస్తుత పాలకుల మనస్తత్వం అర్దం అవుతుందన్నారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కాంక్షించే పౌర సమాజంగా అందరికీ ఆమోద్యయోగమైన అభివృద్ధిని కోరుకొంటాము తప్ప ఆదివాసీలను నీళ్లలో ముంచి రైతులకు నీళ్లు పారించమని ఏ రైతు బిడ్డ కోరుకోరన్నారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు కాబట్టి పోలవరంకి అయ్యే మొత్తం ఖర్చు కేంద్రమే భరించాలి.ప్రాజెక్ట్ పునరావాసంతో సంబంధం లేదు అనే కేంద్ర ప్రభుత్వ విధానం ఎలా ఉందంటే ఇల్లు కట్టుకోండి తరువాత రంగులకి డబ్బులు ఇచ్చి మేము కట్టినట్టు మా పేరు పేరు వేసుకొంటాము అన్నట్టు ఉందన్నారు.

మన ముఖ్య మంత్రి కి కాంట్రాక్టర్ లు అంటే మహా ఇష్టం కేంద్రం నుంచి ప్రాజెక్ట్ నిర్మాణం తాలూక బిల్లులు అడుగుతారు గాని పునరావాసం తాలూక నిధులు అడగలేరు ఇదే ఈయన చెప్పే పేదలకు పెద్దలకు మధ్య యుద్ధంలో పేదల పక్షం అని ఉదరగొట్టడం అన్న మాట. పోలవరం ప్రాజెక్ట్ ఆంధ్రుల కల అలాంటి ప్రాజెక్ట్ పూర్తికావాలంటే ముందు నిర్వాసితుల సమస్యను పరిష్కరించాలి పోలవరం కి అయ్యే మొత్తం ఖర్చు కేంద్రమే భరించాలి అని ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్ ఫోరమ్ డిమాండ్ చేస్తుందన్నారు. పోలవరం ప్రాజెక్ట్ రాష్ట్ర జీవనాడి ప్రకాశం జిల్లా రాయలసీమ ఉత్తరాంధ్రకు తాగు సాగునీటికోసం రూపొందించిన బహుళార్థక ప్రాజెక్ట్ పూర్తవ్వాలి అంటే నిర్వాసితులకు సమస్యల పరిష్కరానికి రాష్ట్ర ప్రజలందరం మద్దతు గ ముందుకురావాలి అప్పులదే పాలకుల ఆలోచన విధానం మారుతుంది అని ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్ ఫోరమ్ గ రాష్ట్ర అన్ని పౌర ప్రజాసంఘాలకు పిలుపునిస్తున్నామన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రభుత్వ కృషికి నైతిక విలువలు తోడైతే దేశంలోనే నెం.1గా ఎపి విద్యావ్యవస్థ!

-క్లాస్ రూం నుంచే సమాజంలో మార్పు సాధ్యం…అందుకే విద్యాశాఖ ఎంచుకున్నా -సాంకేతికతకు భారతీయ విలువలు జోడించి ప్రపంచ విజేతలుగా ఎదుగుదాం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *