-దహించు అగ్ని మినిస్ట్రీస్ అధ్యక్షులు థామస్. వి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మణిపూర్లో క్రైస్తవులపై దాడులను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని దహించు అగ్ని మినిస్ట్రీస్ అధ్యక్షులు డాక్టర్ థామస్.వి డిమాండ్ చేశారు. మణిపూర్ లోని క్రైస్తవులపై దాడులను ఆపి శాంతి నెలకొల్పేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ దహించు అగ్ని మినిస్ట్రీస్ అధ్యక్షులు థామస్వి ఆధ్వర్యంలో గాంధీనగర్ లోని కందుకూరి కళ్యాణ మండపంలో సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన క్రైస్తవులపై దాడులకు నిరసనగా ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడచిన కొన్నేళ్లుగా చర్చిలను కూల్చటం క్రైస్తవులపై ,విశ్వాసులపై దాడులు చేయటం వలన క్రైస్తవులలో అభద్రతా భావం పెరుగుతుందని అన్నారు. మణిపూర్ లో క్రైస్తవుల పై జరిగిన దాడి మమ్ములను ఎంతో భావోద్వేగానికి బాధను కలుగ చేసిందని అన్నారు. అందుకు నిరసనగా ఈ శాంతి ర్యాలీని చేపట్టడం జరిగిందని థామస్ అన్నారు. దాదాపు ఈ మంది క్రైస్తవులు స్వచ్ఛందంగా మణిపూర్ లో జరుగుతున్న హింసకు ఈ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భారత రాజ్యాంగంలో భారతీయులకు మత స్వేచ్ఛ హక్కును కలిగి ఉన్నారని తమ మతాన్ని గురించి చెప్పుకోవడం కానీ దాని గురించి ప్రకటించే స్వేచ్ఛ అని అందరి హక్కు అని ఆయన అన్నారు. ఆ మత స్వేచ్ఛ హక్కును నేటి ప్రభుత్వాలు ఉక్కు పాదాలతో అణిచి వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
మణిపూర్ లో దాడులకు గురైన బాధిత కుటుంబాలకు తక్షణ సహాయంగా 10 లక్షల విలువ చేసే సహాయాన్ని అందజేస్తున్నట్టు దహించు అగ్ని మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు తామస్ వి చెప్పారు.
మణిపూర్లో హింస బిజెపి కుట్ర అని ఏఐసీసీ జాతీయ అధ్యక్షులు జాన్ బెన్నీ లింగం అన్నారు. ప్రధానమంత్రి మోడీ ఇవన్నీ చూస్తూ కూడా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. మణిపూర్ లో క్రైస్తవులపై జరుగుతున్న దాడులు బయట ప్రపంచానికి తెలియకుండా ప్రధానమంత్రి మోడీ ,మణిపూర్ ముఖ్యమంత్రి ఇంటర్నెట్ ,మీడియాను కట్టడి చేస్తున్నారని అన్నారు. మణిపూర్ లో క్రైస్తవులపై దాడులను దాహనకాండలను ఆపకపోతే బిజెపికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తామని దీనికి నరేంద్ర మోడీ సమాధానం చెప్పి తీరాలని డిమాండ్ చేశారు .మణిపూర్ లో ఇప్పటికే వెయ్యి మంది పాస్టర్లను క్రైస్తవులను చంపి వేయడం జరిగిందని 500 చర్చిలను కూల్చి వేయడం జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
అనంతరం ఎన్టీఆర్ జిల్లా క్రిస్టియన్ మైనారిటీ చైర్మన్ రెవరెండ్ దయానంద్ మాట్లాడుతూ మణిపూర్ లో క్రైస్తవులపై దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు .మత స్వేచ్ఛ గల భారతదేశంలో క్రైస్తవులపై హింసకాండము కొనసాగించటం దారుణమని అన్నారు. గడిచిన మూడు నెలలుగా మణిపూర్ లో క్రైస్తవులపై దాడులు జరుగుతుంటే కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్వవహరిస్తున్నారని దుయ్యబట్టారు. నేడు క్రైస్తవులపై జరుగుతున్న దాడికి రేపు ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. మణిపూర్ లోని శాంతిభద్ర నెలకొల్పేందుకు కమిటీని నియమించాలని అలాగే నిరాశ్రయునివారికి వాళ్ళని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ రోజున క్రైస్తవులపై మీరు చేస్తున్న దానికి తప్పనిసరిగా రాబోయే ఎలక్షన్లలో మూల్యం చెల్లించక తప్పదు అని హెచ్చరించారు. మణిపూర్ లో శాంతిని నెలకొల్పేందుకు కమిటీలు ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. భారతదేశంలో క్రైస్తవులు దాదాపు 30% మంది ఉన్నారని అన్నారు. క్రైస్తవుల పై దాడులు ఆకపోతే వారందరూ బుద్ధి చెప్తారని అన్నారు.
ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున 1000 మంది పైగా పాల్గొనని క్రైస్తవులు శాంతికాముకులని మణిపూర్ లో హింస కాదు శాంతి కావాలని నినాదించారు.
Prajavartha Online Telugu News