-7వ విడతలో 21,926 మందికి 23 కోట్ల 61 లక్షల 20 వేల రూపాయల ఆర్థిక సాయం..
-బుణాలను తిరిగి చెల్లించిన 17,328 మందికి 32 లక్షల 51 వేల 086 రూపాయల వడ్డీ జమ..
-జిల్లా కలెక్టర్ డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జగనన్న తోడు తో చిరువ్యాపారస్థులు, సాంప్రదాయ చేతి వృత్తుల వారికి ఆర్థికంగా బలోపేతం చేయాలన్న లక్ష్యంతో జిల్లాలో ఏడో విడతలో 21,926 మంది లబ్దిదారులకు 23 కోట్ల 61 లక్షల 20 వేల రూపాయలు, బుణాలను తిరిగి చెల్లించిన 17,328 మందికి 32 లక్షల 51 వేల 086 రూపాయల వడ్డీని లబ్దిదారుల ఖాతాలో జమ చేసి ఆర్థిక సాయం అందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు అన్నారు.
జగనన్న తోడు పథకం ద్వారా రాష్ట్రంలోని లబ్దిదారులకు మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి లబ్దిదారుల ఖాతాలకు బటన్ నొక్కి నగదు జమ చేశారు. ఈ కార్యక్రమాన్ని కలెక్టరేట్ నుండి ప్రజా ప్రతినిధులు, అధికారులు, లబ్దిదారులతో కలిసి ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించిన అనంతరం జిల్లాకు చెందిన లబ్దిదారులకు ఆర్థిక సహాయ చెక్‌ను శాసనసభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు, మల్లాదివిష్ణువర్థన్, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కలెక్టర్ ఎస్. డిల్లీరావు అందజేశారు.
ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, శాసనసభ్యులు మల్లాదివిష్ణువర్థన్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా చిరు వ్యాపారస్థులకు చేయూతను అందించేందుకు జగనన్న తోడు పథకాన్ని జిల్లాలో వరుసగా ఏడవ విడతలోను ఆర్థిక సహాయాన్ని అందించి లబ్దిదారుల ఖాతాలకు నేరుగా జమ చేస్తున్నామన్నారు. రోజువారి అవసరాలకు అయ్యే పెట్టుబడికి నూటికి 10 రూపాయల వరకు చిరు వ్యాపారస్తులు వడ్డీని చెల్లిస్తున్నారన్నారు. తద్వారా వారి సంపాదనలో అధిక భాగం వడ్డీలకు సరిపోయేదన్నారు. వారి దుస్థితిని చూసి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చిరు వ్యాపారస్థులకు చేయూత అందించేందుకు 2020 నవంబర్ 25వ తేదిన జగనన్న తోడు పథకానికి శ్రీకారం చుట్టారన్నారు. ఈ పథకం ద్వారా ఎలాంటి పూచీకత్తు అవసరం లేకుండా తొలి సారి 10,000 రూపాయల బుణం అందించడంతోపాటు తీసుకున్న బుణానికి ప్రతీ నెల కిస్తీని సకాలంలో చెల్లించే వారికి బుణం పై వడ్డీ మొత్తాన్ని ప్రభుత్వమే తిరిగి చెల్లిస్తుందని శాసన సభ్యులు మల్లాది విష్ణువర్థన్ అన్నారు.
మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ ‘‘జగనన్న తోడు’’ పథకం చిరువ్యాపారులకు సాంప్రదాయ చేతి వృత్తుల వారి ఉపాధికి ఒక వరం అన్నారు. రోజువారి పెట్టుబడి ఖర్చులకు వడ్డీ వ్యాపారస్తుల చుట్టు తిరగాల్సిన దుస్థితి లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి వడ్డీలేని బుణాలు అందిస్తున్నామన్నారు. బ్యాంకులకు చెల్లించిన వడ్డీ మొత్తాన్ని ప్రతీ 6 నెలలకు ఒక సారి నేరుగా లబ్దిదారుల ఖాతాలలో జమ అయ్యేలా ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. ఫుట్‌పాత్‌లు వీధుల్లో తోపుడు బండ్ల పై వస్తువులు కూరగాయలు పండ్లు ఆహార పదార్థాలు అమ్మకాలు నిర్వహించుకుని జీవించేవారు. రహదారి పక్కన టిఫెన్ సెంటర్‌ను నిర్వహించుకునే వారందరికి జగనన్న తోడు పథకం ద్వారా లబ్ది చేకూరుస్తున్నమన్నారు. చిరువ్యాపారుల ఆర్థిక ఇబ్బందులను గమనించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జగనన్న తోడు పథకం ద్వారా బ్యాంకుల నుండి బుణ సహాయం కల్పిస్తున్నారన్నారు. బ్యాంకుల నుండి చిరు వ్యాపారులు తీసుకున్న బుణానికి వడ్డీని ప్రభుత్వమే భరిస్తుందన్నారు. జగనన్న తోడుతో చిరువ్యాపారస్తులు, సాంప్రదాయ చేతి వృత్తిదారుల కళ్ళలో ఆనందం చూడగలుగుతున్నామని శాసన సభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు అన్నారు.
నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ విజయవాడ తూర్పు, సెంట్రల్, పశ్చిమ నియోజకవర్గాల పరిధిలోని 9,054 మంది లబ్దిదారులకు 8 కోట్ల 83 లక్షల రూపాయలను అదంజేయడం జరుగుతుందన్నారు. నగర పాలక సంస్థ పరిధిలో ఎక్కువ సంఖ్యలో తోపుడు బండ్లు, ఫుట్‌పాత్‌లపై వ్యాపారాలు నిర్వహించుకునే చిరు వ్యాపాస్థులు అర్హులైన వారందరికి లబ్ది చేకూరేలా పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో బుణాలను మంజూరు చేస్తున్నామన్నారు. అర్హత ఉన్నప్పటికి లబ్ది చేకూరని వారు సమీపంలోని వార్డు సచివాలయాన్ని, వాలంటీర్లను సంప్రదించి బుణాలు పొందాలని నగర మేయర్ అన్నారు.
జిల్లా కలెక్టర్ డిల్లీరావు మాట్లాడుతూ జిల్లాలో చిరు వ్యాపారస్తులను గుర్తించి వారికి బ్యాంకుల నుండి బుణాన్ని అందించేందుకు ప్రత్యేక డైవ్ ద్వారా లబ్దిదారులను గుర్తించే విధంగా అధికారులను ఆదేశించామన్నారు. అర్హత ఉన్నప్పటికి జాబితాలో పేర్లు నమోదు కాని వారు గ్రామ వార్డు వాలంటీర్లను సంప్రదించి సంబంధిత సచివాలయాలలో దరఖాస్తు చేసుకోవచ్చునని అన్నారు. వ్యాపారస్తులు తీసుకున్న ఆర్థిక సాయాన్ని సకాలంలో బ్యాంకులకు తిరిగి చెల్లించి మరింత ఆర్థిక సహాయాన్ని పొందాలని కలెక్టర్ కోరారు.
కార్యక్రమంలో డిప్యూటి మేయర్లు బెల్లం దుర్గ, అవుతూ శైలజారెడ్డి, తూర్పు నియోజకవర్గ ఇన్ చార్జ్ దేవినేని అవినాష్, డిఆర్‌డిఏ పిడి కె. శ్రీనివాస్, కార్పొరేషన్ల చైర్మన్లు టి శ్రీకాంత్, అడపా శేషగిరి, మనోజ్ కొఠారి, గీతాంజలిదేవి, గ్రంధాలయ సంస్థ చైర్మన్ జమల పూర్ణమ్మ, వక్ఫ్‌బోర్డు చైర్మన్ గౌస్ మొహంతి, దుర్గ గుడి పాలక మండలి చైర్మన్ కర్నాటి రాంబాబు, యుసిడి ప్రాజెక్టు ఆఫీసర్ శకుంతల, లబ్దిదారులు పాల్గొన్నారు.
జగనన్న తోడు పథకంలో లబ్దిదారు మాటలలో
నగరంలోని సత్యనారాయణ పురానికి చెందిన జి. శ్రీ పావని తనకు జగనన్న తోడు పథకం ద్వారా ఆర్థిక సహాయం అందిందన్నారు. స్వయం సహాయక సంఘాల బుణాల ద్వారా ఆహార పద్దార్థాలు తయారు చేసే మిషనరీ కొనుగోలు చేయడం జరిగిందని, జగనన్న తోడు ద్వారా వచ్చే 10 వేల రూపాయలు న్యూట్రీషన్ ఫుడ్స్ సంబంధించి ఆహారపద్దార్థాలు తయారీలో మెటిరీయల్‌కు ఉపయోగిస్తానని తెలిపారు. మిల్లెట్స్‌లో తాటి బెల్లం కలిపి, డ్రై ఫుడ్స్ వంటి తినుబండారాలు తయారు చేస్తామన్నారు. అమ్మకాలు అధికంగా ఉండడం వలన జగనన్న తోడు ద్వారా మరిన్ని మెటిరీయల్స్‌ను కొనుగోలు చేసి అధికంగా తినుబండారాలు తయారు చేసుకోవడానికి అవకాశం కలిగిందని ఆమె తెలిపారు.
Prajavartha Online Telugu News