-జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తరచు ప్రమాదాలు జరిగే ప్రదేశాలలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి ప్రమాదాలపై వాహనదారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకునేలా అవగాహన కల్పించాలని రహదారి భద్రతా కమిటి చైర్మన్, జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు సంబంధిత అధికారులను ఆదేశించారు.
రహదారి భద్రతా కమిటీ సమావేశాన్ని నగరంలోని కలెక్టరేట్ నుండి మంగవారం కమిటి చైర్మన్, జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు రవాణా, పోలీస్, ఆర్‌అండ్‌బి, రెవెన్యూ, నగరపాలక సంస్థ, వైద్య ఆరోగ్య శాఖ, జాతీయ రహదారుల అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలును కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో తరచు ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాల (బ్లాక్ స్పాట్స్) వద్ద అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ఏడాది జనవరి నుండి జూన్ వరకు 790 ప్రమాదాలు జరగగా 784 మంది క్షతగాత్రులు కాగా, 187 మంది ప్రాణాలను కోల్పోవడం జరిగిందన్నారు. జరిగిన ప్రమాదాలపై రవాణా, పోలీస్, ఆర్‌అండ్‌బి, వైద్య ఆరోగ్య శాఖ, రెవెన్యూ, జాతీయ రహదారుల అధికారులు సంయుక్తంగా విశ్లేషించి ప్రమాదానికి అసలు కారణాలపై లోతైన అద్యయనం చేసి నివారణ చర్యలు చేపట్టాలన్నారు. జరిగిన ప్రమాదాలను విశ్లేషిస్తే జాతీయ రహదారులపై 92, రాష్ట్ర రహదారులపై 36, ఇతర రహదారులపై 59 ప్రమాదాలు జరిగినట్లుగా గుర్తించడం జరిగిందన్నారు. ప్రమాదాలు ఎక్కువగా మధ్యాహ్నం 12 గంటల నుండి 3 గంటల వరకు, సాయంత్రం 6 గంటల నుండి అర్థరాత్రి 12 గంటల వరకు జరుగుతున్నాయన్నారు. ఆయా సమయాలలో అధికారులు మరింత అప్రమత్తంగా ఉండి నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రమాదాలు ఎక్కువగా ద్విచక్ర మోటార్ వాహనాలు, కార్లు, జీపులు, టాక్సీల వల్ల జరుగుతున్నాయన్నారు. ప్రమాదాలు ఎక్కువగా చిల్లకల్లు, ఇబ్రహీంపట్నం, నందిగామ, తిరువూరు, పోలీస్ స్టేషన్ పరిధిలో జరుగుతున్నట్లు నివేధికలు తెలుపుతున్నాయని ఆయా ప్రాంతాల పరిధిలో నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ఏడాది మే 1వ తేది నుండి జూన్ 30వ తేది వరకు నిబంధనలను అతిక్రమించిన వారిపై రోడ్డు భద్రతా నేరాలుగా గుర్తించి రవాణా శాఖ 2,963 కేసులను పోలీస్ శాఖ వారు 1,59,228 కేసులను నమోదు చేయడం జరిగిందన్నారు. వీటిలో అత్యధికంగా పోలీస్ శాఖకు సంబంధించి 68,851 హెల్మెట్ లేకుండా వాహనాలు నడుపుతున్న వారు, రాంగ్ పార్కింగ్ గా 42,128, త్రిపుల్ రైడిరగ్ గా 20,940 కేసులను నమోదు చేయడం జరిగిందన్నారు. నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించినా, డ్రంక్ అండ్ డ్రైవింగ్ కు పాల్పడే వారిపై ప్రత్యేక నిఘాతో కఠినంగా వ్యవహరించాలని కలెక్టర్ డిల్లీరావు అధికారులను ఆదేశించారు.
కాన్ఫరెన్స్‌లో నగరపాలక సంస్థ కమీషనర్ స్వప్నిల్ దినకర్ పుడ్కర్, డిప్యూటి ట్రాస్‌ఫ్ట్‌ోం కమీషనర్ యం పురేంద్ర, డియంహెచ్‌వో డా. యం సుహాసిని, ఆర్‌అండ్‌బి ఎస్‌ఇ జాన్‌మోషే, పోలీస్ అధికారులు ఉన్నారు.
Prajavartha Online Telugu News