విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం ఓ రాజకీయ నాయకుడు పెడుతున్న అక్రమ కేసుల కు బలవుతున్నామని ఎస్సీ కుటుంబం బుధవారం విజయవాడ ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా శావ నాగ జగన్ బాబురావు మీడియాతో మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సిపి మొదటినుంచి మేము జగన్ వెంటే ఉండి జగన్ తలపెట్టిన పాదయాత్ర , బస్సుయాత్ర, ఓదార్పు యాత్ర కానీ ప్రతి యాత్రలో కూడా మేము సహకరించి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేంతవరకు మేము ఆహార్నిశలు రాత్రి పగలు ఎంతో కష్టపడి ఉన్నామని తెలిపారు. అలాంటిది నాపైన నా కుటుంబం పైన మా ఎస్సీ వర్గాలపైన దూలం నాగేశ్వరరావు ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు నుంచి అజమాయిషి చూపిస్తూ మమ్మల్ని అణగదొక్కే ప్రయత్నం చేస్తూ మమ్మల్ని తీవ్రమైన ఇబ్బందులకు భయాందోళనలకు గురి చేస్తున్నారని కేసులు పెట్టే ఆర్థికంగా. శారీరికంగా. మానసికంగా బాధపెడుతున్నారని ఆవేదన వ్యక్తపరిచారు. ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు వలన నాకు నా కుటుంబానికి మా ఎస్సీ కుల సంఘాలకి తీవ్రమైన అన్యాయం జరుగుతూ ఉందని మాకు ప్రాణ భయం ఉందని దీనిపై తక్షణమే సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందించి తగి చర్యలు తీసుకుని మాకు రక్షణ కల్పించి మమ్మల్ని కాపాడుతారని కోరుతున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అంటే మాకు ఎంతో అభిమానం అని మళ్లీ ముఖ్యమంత్రిగా చేయాలని తపనతో మేము కష్టపడి పని చేస్తుంటే మాపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్న ఎమ్మెల్యే దూలం నాగేశ్వరావు పైన తగిన చర్య తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రభుత్వ పెద్దలను మీడియా ద్వారా కోరారు. ఈ కార్యక్రమంలో కైకలూరు నియోజకవర్గ ఎస్సీ కుటుంబాలకు చెందిన బాబ్జి ఏసు పోగు దానియేలు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News