అక్టోబరు 2 గాంధి జయంతి వరకు స్వచ్ఛతాహి కార్యక్రమాలు

-స్వచ్ఛతాహి సేవ- ఇండియన్ స్వచ్ఛ లీగ్ 2.0 అవగాహన కార్యక్రమాలు..
-చెత్త రహిత నగరంగా తీర్చి దిద్దేందుకు ప్రజల భాగస్వామ్యం అవసరం..
-మన రాజమహేంద్రవరం .. పరిశుభ్రమైన నగరం లో అందరం కలిసి అడుగులు వేద్దాం …
-ప్రతి ఒక్కరం సమిష్ట బాధ్యతతో నగరాన్ని పరిశుభ్రతగా ఉంచుదాం.
-జిల్లా కలెక్టరు డా. కే.మాధవీలత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాజమహేంద్రవరంను చెత్త రహిత నగరంగా తీర్చి దిద్దేందుకు ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని, సమిష్టి బాధ్యతతో పరిశుభ్రతగా ఉంచేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టరు డా. కే.మాధవీలత పిలుపునిచ్చారు.

ఆదివారం ఉదయం ‘‘స్వచ్ఛతాహి సేవ’’, ఇండియన్ స్వచ్ఛ లీగ్ 2.0 కార్యక్రమాలలో భాగంగా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో స్థానిక వై జంక్షన్ నుంచి పుష్కరఘాట్ వరకు నిర్వహిస్తున్న సైకిల్ థాన్ ర్యాలీ కార్యక్రమానికి జిల్లా కలెక్టరు డా. కే.మాధవీలత జెండా ఊపీ ప్రారంభించారు. తొలుత సెల్ఫి పాయింట్ వద్ద సెల్ఫి దిగడం జరిగింది. ఈ ర్యాలీలో నగరపాలక సంస్థ కమీషనరు కే.దినేష్ కుమార్, సహాయ కలెక్టరు యశ్వంత్ కుమార్ రెడ్డి, నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది, నగరపాలక సంస్థ పాఠశాలల, వివిధ విద్యా సంస్థల విద్యార్ధిని విద్యార్థులు, జేసిఐ సభ్యులు పాల్గొన్నారు.

ఈ సందర్బంగా కలెక్టరు మాధవీలత మీడియాతో మాట్లాడుతూ జిల్లా ప్రధాన కేంద్రం రాజమహేంద్రవరాన్ని చెత్త రహిత నగరంగా తీర్చి దిద్దేందుకు ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసర మన్నారు. ప్రతి ఒక్కరూ తమ వంతు సామాజిక భాద్యతగా సమిష్టి భాగస్వామ్యం తో గ్రామాలను, పట్టణాలను పరిశుభ్రతగా ఉంచేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టరు డా. కే.మాధవీలత పిలుపునిచ్చారు. నగరపాలకసంస్థ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం నగరాన్ని పరిశుభ్రమైన నగరంగా పచ్చని వాతావరణంలో ఉంచేందుకు ఇండియన్ స్వచ్ఛ లీగ్ 2.0 కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని పేర్కొన్నారు. ఇండియన్ స్వచ్ఛ లీగ్ 2.0 కార్యక్రమాన్ని సెప్టెంబరు 17వ తేదీ నుంచి అక్టోబరు 2 గాంధి జయంతి వరకు పక్షం రోజుల పాటు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛతాహి సేవ అనే నినాదానికి పిలుపునిస్తూ యువత ముందుకు వచ్చి స్వచ్చందంగా పరిసరాల పరిశుభ్రతకు తమ వంతు సహకారాన్ని అందించాలని కోరారు. పరిశుభ్రత అనేది కేవలం ప్రభుత్వం చొరవతో మాత్రమే కాదని, ప్రతి పౌరుడు సమిష్ట బాధ్యతతో గ్రామ, పట్టణాల్లో కాలుష్యరహిత ఉండేందుకు కృషి చెయ్యడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని కలెక్టరు మాధవీలత పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమాన్ని ఎంతో చక్కగా ముందుండి నడిపిస్తున్న నగరపాలసంస్థ కమీషనర్ వారి సిబ్బందిని అభినందిస్తున్నానని తెలిపారు.

నగరపాలక సంస్థ కమీషనరు కే.దినేష్ కుమార్ మాట్లాడుతూ ‘‘స్వచ్ఛతాహి సేవ’’, ఇండియన్ స్వచ్ఛ లీగ్ 2.0 కార్యక్రమాలలో పాల్గొనేందుకు వచ్చిన విద్యార్థులు, నగర ప్రజలకు అభినందనలను తెలియజేశారు. నిన్నటి రోజు శనివారం నిర్వహించిన మోగా ఘాట్ పరిశుభ్రత కార్యక్రమంలో 2 వేల మంది ప్రజలు స్వచ్చందంగా పాల్గొన్నారన్నారు. ఈరోజు సైకిల్ ర్యాలీ ద్వారా ‘‘స్వచ్ఛతాహి సేవ’’ కార్యక్రమానికి సంబందించి ప్రజల్లో మరింతగా అవగాహన కల్పిస్తున్నామన్నారు. అదే విధంగా స్వచ్ఛతాహి సేవ’’ ఇండియన్ స్వచ్ఛ లీగ్ 2.0 సంబందించి నగరంలో మరిన్ని కార్యక్రమాలను నిర్వహించ బోతున్నామన్నారు. ఇందులో భాగంగా రానున్న శుక్రవారం ఆర్ట్స్ కళాశాల మైదానంలో మెగా ఐఎస్ఎల్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని నగర ప్రజలందరూ పెద్దఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

భారత్ స్వచ్ఛహత లీగ్ సీజన్-2 సెల్ఫ్ పాయింట్ ఏర్పాటు, సైకిల్ థాన్ ర్యాలీ నిర్వహించారు. సెల్ఫ్ పాయింట్ వద్ద కలెక్టర్, మునిసిపల్ కమిషనర్, సహాయ కలెక్టర్ విద్యార్థులు ఫోటోలు దిగారు. అనంతరం నిర్వహించిన సైకిల్ ర్యాలీలో దినేష్ కుమార్ యస్వంత్ కుమార్ లు పాల్గొనడం గమనార్హం.

కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమీషనరు కే.దినేష్ కుమార్, సహాయ కలెక్టరు యశ్వంత్ కుమార్, మున్సిపల్ హెల్త్ అధికారిణి డా. ఎ. వినూత్న, డిప్యూటీ ఇన్స్ పెక్టర్ ఆఫ్ స్కూల్స్ దిలీప్ కుమార్, నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది, వివిధ పాఠశాలల విద్యార్థులు, జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ సభ్యులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *