ఆడపడుచులను వ్యాపారులుగా తీర్చిదిద్దడమే లక్ష్యం

-ఆడపడుచులను వ్యాపారులుగా తీర్చిదిద్దడమే లక్ష్యం
-మెప్మా అర్బన్ మార్కెట్ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడం, వారిని వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడమే మెప్మా అర్బన్ మార్కెట్ లక్ష్యమని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. గాంధీనగర్లో ఏర్పాటు చేసిన అర్బన్ మార్కెట్ ను నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, పీఓ యూసిడి శకుంతల, స్థానిక కార్పరేటర్ బాలి గోవింద్ తో కలిసి గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా స్టాల్స్ ను సందర్శించి పొదుపు సంఘాల సభ్యులు తయారుచేసిన ఉత్పత్తులను పరిశీలించారు. స్వయం సహాయక సంఘాలను మరింత బలోపేతం చేసి సభ్యులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మహిళా మార్కెట్ లను ఏర్పాటు చేస్తున్నట్లు మల్లాది విష్ణు తెలిపారు. కార్పొరేట్ సూపర్ మార్కెట్లను తలదన్నే రీతిలో ఈ మార్టులు రూపుదిద్దుకుంటున్నట్లు వెల్లడించారు. డ్వాక్రా సంఘాల సభ్యులే యజమానులుగా, వారి భాగస్వామ్యంతో ఏర్పాటైన మార్టుల్లో వినియోగదారులకు సరసమైన ధరలకు, నాణ్యమైన నిత్యావసర సరుకులు లభిస్తాయని చెప్పారు. పొదుపు సంఘాల సభ్యులు తయారుచేసిన ఉత్పత్తుల నుంచి ప్రముఖ కంపెనీల ప్రొడక్టులు వరకు ఈ మార్టుల్లో వినియోగదారులకు అందుబాటులో ఉంటాయన్నారు. అలాగే అమూల్, రిలయన్స్, ఫ్లిప్ కార్ట్ వంటి సంస్థలతో ఒప్పందాలు చేసుకుని అవసరమైన సరకులను ఆర్డర్ చేయడం ద్వారా వినియోగదారులకు అందజేయడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటుతో అక్కచెల్లెమ్మలు ఆర్థిక పురోభివృద్ధి సాధించి.. వ్యాపారులుగా మారాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. కార్యక్రమంలో సీడీఓ జగదీశ్వరి, టీఈలు, పొదుపు సంఘాల మహిళలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *