జిల్లాలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలి

-ప్రతీ నెల తప్పనిసరిగా నాల్గవ శనివారం గ్రామాల్లో సివిల్‌ రైట్స్‌ డే నిర్వహించాలి.
-ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ చట్టం పై ప్రజలకు అవగాహన కల్పించాలి.
-జిల్లా కలెక్టరు డా. మాధవీలత, యంపీ. భరత్ రామ్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ డా. కే.మాధవీలత, యం.పి. మార్గాని భరత్ రామ్ అధికారులకు సూచించారు.

బుధవారం ఉదయం స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఎస్సి, ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్‌ డా. మాధవీలత అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో యం.పి మార్గాని భరత్ రామ్, ఎస్పీ పి. జగదీష్, మున్సిపల్ కమీషనర్ కే.దినేష్ కుమార్,జేసీ తేజ్ భరత్, సహాయ కలెక్టరు సి.యశ్వంత్ కుమార్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

ఈ సందర్బంగా అట్రాసిటీ కేసుల పురోగతిపై రాజమహేంద్రవరం, కొవ్వూరు డివిజన్‌ల వారీగా కలెక్టర్‌ సమీక్షించారు. అనతరం కలెక్టరు డా. మాధవీలత సమీక్షిస్తూ అంటరానితనం, మూఢ నమ్మకాలు, అట్రాసిటీలపై చర్చకు కమిటీ సమావేశం ఒక మంచి వేదిక అని అన్నారు. కేసుల దర్యాప్తును వేగవంతంగా పూర్తి చేసి నిర్ణీత గడువులోపు చార్జ్‌ షీట్‌ దాఖలు చేయాలన్నారు. బాధితులకు సత్వర న్యాయం జరిగేందుకు వీలుగా పకడ్బందీగా దర్యాప్తు జరిపి పూర్తి ఆధారాలను సేకరించి సకాలంలో చార్జ్‌ షీట్‌ ఫైల్‌ చేయాలన్నారు. పోలీస్‌, రెవెన్యూ తదితర శాఖల అధికారులు సమన్వయంతో ముందుకెళ్లాలని ఆయన తెలిపారు. సామాజిక బహిష్కరణలు విధిస్తూ, చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిపై కేసులు నమోదు చేసి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. బాధితులకు ప్రభుత్వం తరపున అందించాల్సిన ఆర్ధిక సహాయాన్ని సకాలంలో అందే విధంగా చూడాలన్నారు. విజిలెన్సు అండ్‌ మానిటరింగ్‌ కమిటీ సమావేశాన్ని క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నట్లు, తద్వారా సమస్యలు జిల్లా యంత్రాంగం దృష్టికి వచ్చి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. కమిటీలోని అనధికార సభ్యులు కూడా క్రియాశీలక పాత్ర పోషించాలని, క్షేత్ర స్థాయిలో అట్రాసిటీ అంశాలతో ముడిపడి ఉన్న సంఘటనల గురించి ఎప్పటికప్పుడు తమ దృష్టికి తేవాలని అన్నారు. ప్రతీ నెల తప్పనిసరిగా నాల్గవ శనివారం గ్రామాల్లో సివిల్‌ రైట్స్‌ డే నిర్వహించేలా చూడాలని, ఆయా కార్యక్రమాలకు సంబందించి యంపీడీవో,తహసీల్దార్‌, ఎస్హెచ్‌ఓలు హాజరవ్వాలని కలెక్టరు మాధవీలత ఆదేశించారు. అదేవిధంగా డివిజన్ కేంద్రాల్లో కూడా డివిజన్ స్థాయి సమావేశాలు నిర్వహించాలని సూచించారు. ఎస్సీ ఎస్టీ కేసులకు సంబందించి కులధృవీకరణ పత్రాలు జారీ చేయడంలో తాహశీల్థార్లు జాప్యం చెయ్యవద్దని సూచించారు. జిల్లాలో 2016 నుండి ఇప్పటి వరకు 92 మంది బాధితులకు రూ. 1,11,90,000 లు పరిహారం మంజూరు చేయడం జరిగిందన్నారు.

యం.పి మార్గాని భరత్ రామ్ మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన హక్కలను అనుసంధానంగా రక్షణ వ్యవస్థతో పాటు కమిటీ సభ్యులు ఎస్సీ,ఎస్టీ వర్గాల వారికి ఎటువంటి అన్యాయం జరగకుండా భాద్యతాయుతంగా పనిచేస్తూ ప్రభుత్వానికి మంచి పేరుతేవాలని సూచించారు. ఎక్కడైనా పాల్స్ కేసులు నమోదైతే వాటిని అరికట్టే బాధ్యత కూడా మీపై ఉందని ఎంపి అన్నారు.

ఎస్పీ పి.జగదీష్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులకు సంబంధించిన ఘటనలు చోటుచేసుకున్నప్పుడు పోలీస్‌ శాఖ తరపున బాధితులకు తప్పనిసరిగా పూర్తి న్యాయం జరిపించేందుకు కృషి చేస్తున్నామన్నారు. జిల్లాలో రాజమహంద్రవరం డివిజన్‌ పరిధిలో సెంట్రల్ జోన్ లో 14, తూర్పు జోన్ లో 10, సౌత్ జోన్ లో 8, నార్త జోన్ లో 28, కొవ్వూరు డివిజన్ జోన్ లో 19 మొత్తంగా 79 కేసులు వివిధ దశలలలో విచారణలో ఉన్నాయన్నారు.

ఈ సమావేశంలో ఎస్పీ పి. జగదీష్, మున్సిపల్ కమీషనర్ కే.దినేష్ కుమార్,జేసీ తేజ్ భరత్, సహాయ కలెక్టరు సి.యశ్వంత్ కుమార్, కమిటీ సభ్యులు ఎస్. అబ్రహం, ఏ.సునీల్ కుమార్, పి.డేవిడ్ రాజు, ఏ.చినరాజు, టి.బాలు, ఐ.సత్యనారాయణ, ఎస్.చంటిబాబు, డీఎస్పీలు, కె. విజయ్ పాల్, యం. కిషోర్ కుమార్, కే.శ్రీనివాసులు, కె.తిరుమలరావు, విఎస్ఎన్ డి వర్మ, సిహెచ్ శ్యామలరావు, యం. భక్తవత్సలం, ఏ.శ్రీనివాసరావు, డిఎస్.డబ్ల్యూఓ యం.సందీప్, డిఎల్ పీవోలు, వీణాదేవి, శాంతమణి, పీడీ డ్వామా పి. జగదాంబ, డీపీఓ జె. సత్యనారాయణ, ఎస్ ఈ పిఆర్ ఏబివి ప్రసాద్ డీటీడబ్ల్యూఓ జ్యోతి, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *