-అవినీతి రహిత సమాజం కొరకు కృషి చేద్దాం.
-విజిలెన్స్ ఇన్చార్జ్ ఎస్.పి. కె కుమార్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
భారతదేశ ఆర్థిక, రాజకీయ, సామాజిక అభివృద్ధికి అవినీతి పెద్ద అవరోధంగా మారిందని, అవినీతి నిర్మూలనకు ప్రజలు, ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలు కలిసికట్టుగా పనిచేసేందుకు కృషి చెయ్యాలని విజిలెన్స్ ఇన్చార్జ్ ఎస్.పి. కె కుమార్ అన్నారు.
విజిలెన్స్ అవగాహన వారోత్సవములు సందర్బంగా బుధవారం స్థానిక సబ్-కలెక్టర్ కార్యాలయము కాన్ఫరెన్స్ హాల్ నందు పంచాయతీ రాజ్, రెవెన్యూ, ట్రెజరీ, భూగర్బ & గనుల శాఖ, లీగల్ మెట్రాలజి మరియు అన్నీ శాఖల ఉద్యోగులతో విజిలెన్స్ ఇన్చార్జ్ ఎస్.పి. కె కుమార్ సెమినార్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజిలెన్స్ డైరెక్టర్ జనరల్ కుమార్ విశ్వజిత్ వారి ఆదేశాల మేరకు రాజమహేంద్రవరం విజిలెన్స్ కార్యాలయం పరిధిలో
విజిలెన్స్ అవగాహన వారోత్సవములలోఅక్టోబర్ 30 నుంచి నవంబర్ 5 వ తేది వరకు “అవినీతి వద్దని చెబుదాం – జాతికి అంకితమవుదాం” అనే అంశం పై ప్రజలకు అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా మూడవ రోజు పంచాయతీ రాజ్, రెవెన్యూ, ట్రెజరీ, భూగర్బ & గనుల శాఖ, లీగల్ మెట్రాలజి మరియు అన్నీ శాఖల ఉద్యోగులతో విజిలెన్స్ ఇన్చార్జ్ ఎస్.పి. కె కుమార్ సెమినార్ నిర్వహించడం జరిగిందన్నారు. అవినీతి రహిత సమాజం కొరకు ప్రతి ఒక్కరం కృషి చేద్దామన్నారు. దేశ ఆర్థిక, రాజకీయ, సామాజిక అభివృద్ధికి అవినీతి పెద్ద అవరోధంగా మారిందని, అవినీతి నిర్మూలనకు ప్రజలు, ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలు కలిసికట్టుగా పనిచేయాలని కోరారు.
ప్రత్యేక అతిథిగా విచ్చేసిన రాజమహేంద్రవరం మానస హాస్పిటల్ మానసిక వైద్య నిపుణులు కర్రి రామారెడ్డి, ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రస్తుతం దేశంలో ఉన్న పరిస్థితుల పట్ల అవగాహన కల్పిస్తూ, అవినీతి నిర్మూలనకు మార్చదగిన విషయముల గురించి ఉద్యోగులకు అవగాహన కల్పించారు.
జిల్లా గనులు మరియు భూగర్భ శాఖ అధికారి ఎం.సుబ్రహ్మణ్యం,అసిస్టెంట్ కంట్రోలర్, లీగల్ మెట్రాలజి కె.శామ్యుల్ రాజు ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించియున్నారు.
ఈ సందర్భముగా ప్రత్యేక అతిథి గా విచ్చేసిన కర్రి రామారెడ్డిని ఇన్చార్జ్ ఎస్.పి. కె కుమార్ శాలువతో సత్కరించి జ్నాపికను అందజేశారు.
ఈ కార్యక్రమములో డి. ఎస్. పి పి. ముత్యాలనాయుడు, విజిలెన్స్ అధికారులు, సిబ్బంది మరియు రాజమహేంద్రవరం పట్టణములోని వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News