జిల్లాలో విద్యార్థుల్లో నైపుణ్యం పెంచే విధంగా ఇంటర్నషిప్ కార్యక్రమం

-వివిధ ప్రభుత్వ శాఖలలో రెండు నెలల పాటు నైపుణ్యం శిక్షణ
-శిక్షణ పూర్తి చేసిన ధ్రువపత్రాలు జారీ
-కలెక్టర్ డా కె మాధవీలత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలోని 10 వేల మంది టెక్నికల్, నాన్ టెక్నికల్ విద్యార్థులకు చివరి ఏడాది సెమిస్టర్ విధానంలో రెండు నెలల ఇంటర్నషిప్ కార్యక్రమం ద్వారా నైపుణ్యాభివృద్ధి శిక్షణా కార్యక్రమాలను నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత స్పష్టం చేశారు.

సోమవారంఉదయం కలెక్టరేట్ స్పందన సమావేశ మందిరంలో సమన్వయ శాఖల అధికారులతో ఇంటర్నషిప్ కార్యక్రమం పై కలెక్టర్, జాయింట్ కలెక్టర్ దిశా నిర్దేశనం చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ కె. మాధవీలత మాట్లాడుతూ, విద్యార్థులలోని స్మృజనాత్మక ను గుర్తించి, వారి అకడమిక్ విద్యకు సంబంధించిన రంగంలో నైపుణ్యం కలుగ చేసేందుకు ఆయా శాఖల ద్వారా శిక్షణ తరగతులతో కూడిన ఇంటర్నషిప్ కార్యక్రమం కోసం ప్రణాళిక సిద్ధం చెయ్యాల్సి ఉందన్నారు. చివరి ఏడాది రెండు నెలలపాటు శిక్షణ లో భాగంగా నైపుణ్యాల పెంచేందుకు సెమిస్టర్ విధానం ప్రవేశ పెట్టడం జరుగుతోందని అన్నారు. జిల్లాలో డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న 7921 మంది నాన్ టెక్నికల్ విద్యార్థులు, 2214 మంది టెక్నికల్ విద్యార్థులు ఉన్నారని కలెక్టర్ పేర్కొన్నారు.

సేమిస్టర్ విధానంలో ఈ ఇంటర్నషిప్ కార్యక్రమం కోసం నాన్ టెక్నికల్, టెక్నికల్ శాఖలకు చెందిన అధికారులు ఆయా శాఖల ద్వారా విద్యార్థుల్లో నైపుణ్యం పెంచే విధంగా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని కోరారు. జిల్లాలో వికాస్ నోడల్ అధికారిగా జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ, నన్నయ్య యూనివర్సిటి, ఉన్నత విద్యా శాఖ ఆధ్వర్యంలో వివిధ శాఖలను అనుసంధానం చేయడం జరుగుతుందని అన్నారు. విద్య , వ్యవసాయ అనుబంధ , విద్యుత్ , పరిశ్రమలు, రెవెన్యూ, పంచాయతీ రాజ్, సచివాలయ, ఇరిగేషన్ తదితర శాఖలకు చెందిన అంశాలపై పట్టు సాధించే దిశగా శిక్షణ తరగతులు నిర్వహించి, ఇంటర్నషిప్ కార్యక్రమం పూర్తి చేసిన తదుపరి ధ్రువపత్రాలు అంద చేయాలని మాధవీలత ఆదేశించారు.

సమావేశం లో  ఏపి ఎస్పీ డిసీఎల్ ఎస్ ఈ టివి ఎస్ ఎన్ మూర్తి, ఎస్ ఈ ఎస్ బి వి ప్రసాద్, జిల్లా వ్యవసాయ అధికారి ఎస్. మాధవరావు,  ఎస్ ఈ పి ఆర్ ఎస్ బి వి ప్రసాద్,   జిల్లా రవాణా అధికారి కె వి కృష్ణారావు, హౌసింగ్ పిడి జి. పరశురామ్, జిల్లా ఆర్ అండ్ బి అధికారి  ఎస్ బి వి రెడ్డి,  జిల్లా ట్రైబల్ సంక్షేమ అధికారి కె యస్ జ్యోతి,  ఇరిగేషన్ ఎస్ ఈ జి.శ్రీనివాస రావు, డిసివో వై. ఉమా మహేశ్వర రావు,  ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ లు ఏం . భాను ప్రకాష్, పి. సువర్ణ,  తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *