దివ్యాంగులు వారి ప్రతిభ ప్రదర్శించడం స్ఫూర్తి వంతం

-కలెక్టర్ మాధవీలత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
విభిన్న ప్రతిభావంతులు వారి లోని క్రీడా స్ఫూర్తి ద్వారా మరింత మందికి స్ఫూర్తి నివ్వడం అభినందనీయం అని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత అభినందించారు. స్థానిక కలెక్టరేట్ లో సోమవారం జరిగిన కార్యక్రమంలో అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతులు క్రీడా పోటీల్లో గెలుపొందిన పిల్లలకు కలెక్టర్, జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ కు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ కె. మాధవీలత మాట్లాడుతూ, కాకినాడలో అంతర్జాతీయ విభిన్న ప్రతిభా వంతులకు నిర్వహించిన రన్నింగ్, తదితర క్రీడల్లో జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తూ పిల్లలు పాల్గొని వారి ప్రతిభను ప్రదర్శించడం అభినందనీయం అన్నారు. గెలుపు ఓటములు కాకుండా క్రీడల పట్ల వారి ఆసక్తి మరింత మందికి స్ఫూర్తిని కలిగిస్తోందని కలెక్టర్ అభినందించారు. బూరుగు పూడి కన్న ఆశ్రమ పాఠశాలకు చెందిన 10 మంది , నిడదవోలు హృదయాలయ కు చెందిన 15 మంది విద్యార్థులు పాల్గొని, ప్రతిభను ప్రదర్శించి ఉత్సాహంగా పాల్గొన్నారని పేర్కొన్నారు. పిల్లలందరికీ కలెక్టర్ మాధవీలత, జేసీ తేజ్ భరత్ లు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్, దివ్యాంగుల శాఖ అధికారి బి. నాగ భూషణం, బూరుగు పూడి ఎమ్ ఆర్ కన్న ఆశ్రమ పాఠశాలకు చెందిన శకుంతల దేవి, నిడదవోలు హృదయాలయ కు చెందిన అధ్యక్షులు డి. గణేష్ బాబు, సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *