-సచివాలయం, ఆర్.బి.కె, వెల్నెస్ సెంటర్, సిమెంట్ రహదారుల ప్రారంభం
-రూ.1.8 కోట్లతో అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్
జి.కొండూరు, నేటి పత్రిక ప్రజావార్త :
జి.కొండూరు మండలం హవేలి ముత్యాలపాడు గ్రామం ప్రగతి పథంలో దూసుకెళ్తూ అభివృద్ధికి చిరునామాగా నిలుస్తోంది. రూ.1.8 కోట్లతో నిర్మించిన పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ శుక్రవారం పాల్గొన్నారు. హావేలి ముత్యాలంపాడు గ్రామంలో రూ.43.6 లక్షల వ్యయంతో సచివాలయం భవనం, రూ.20.8 లక్షల వ్యయంతో వైయస్సార్ గ్రామీణ ఆరోగ్య కేంద్ర భవనం, రూ.23.94 లక్షలతో రైతు భరోసా కేంద్ర భవనం రూ.20 లక్షలతో ఎస్సి ఏరియాలో నిర్మించిన సిమెంట్ రహదారులను ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ముఖ్యఅతిథిగా హాజరై శుక్రవారం ప్రారంభించారు.
ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ పాలనా సౌలభ్యం కోసం వీటిని నిర్మించినట్లు వెల్లడించారు. గ్రామాలలో ఆయా అభివృద్ధి పనులతో కోట్లాది రూపాయల ఆస్తులను సమకూర్చుతున్నట్లు వెల్లడించారు. సీఎం జగనన్న పాలనలో అందరూ సంతోషంగా ఉన్నారని వెల్లడించారు. ప్రజలకు పారదర్శకంగా సేవలను అందించాలని అధికారులను, సిబ్బందిని ఆదేశించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News