-ఎన్నికల కమిషన్ కు నివేదిక అందజేస్తాం
-కలెక్టర్ / జిల్లా ఎన్నికల అధికారి కె. మాధవీలత
రాజానగరం, నేటి పత్రిక ప్రజావార్త :
నన్నయ్య యూనివర్సిటీ లో రానున్న సాధారణ ఎన్నికల సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా పరిధిలోని రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గ, ఏడు అసెంబ్లీ నియోజక వర్గాల కు చెందిన కౌంటింగ్ కేంద్రం, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు (ఈవీఎం) భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్‌ను సంబంధిత అధికారులతో కలిసి ముందస్తుగా పరిశీలించడం జరిగిందనీ కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా కె. మాధవీలత పేర్కొన్నారు.
బుధవారం సాయంత్రం కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి నన్నయ్య యూనివర్సిటీ సందర్శించారు. ఈ సందర్బంగా ఎస్పీ పి. జగదీష్ , ఇతర అధికారులతో కలిసి కేంద్రాన్ని పరిశీలించిన అనంతరం అధికారులతో అక్కడ చెయ్యవలసిన చేసిన ఏర్పాట్లపై కలెక్టర్ సూచనలు చేశారు. నియోజక వర్గాల గదుల కేటాయింపు, ఆయా నియోజక వర్గాల నుంచి వచ్చే ఈ వి ఎం లు, వివి ప్యాట్ లు భద్రపరిచే స్ట్రాంగ్ రూం అక్కడ నుంచి కౌంటింగ్ కేంద్రాలకు వెళ్లి రూట్ మ్యాప్, భద్రత తదితర అంశాలను దృష్టిలో పెట్టుకొనిమ్యాప్ ను పరిశీలించారు.
కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు మేరకు మూడు అంచెల భద్రత, తదితర అంశాలపై కూలంకుషంగా క్షేత్ర స్థాయి పరిశీలన చెయ్యడం జరిగింది.
కలెక్టర్ వెంట సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పి. జగదీష్, జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్, ఆర్ ఎం సి కమిషనర్ కె. దినేష్ కుమార్, కొవ్వూరు సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ్, జిల్లా రెవెన్యూ అధికారి జీ. నరసింహులు, ఆర్డీవో ఏ. చైత్ర వర్షిణి , యూనివర్సిటీ సిబ్బంది, ఇతర నియోజక వర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు, డి ఎస్పీ లు,సర్వేయర్లు, మండల స్థాయి అధికారులు, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News