సార్వత్రిక ఎన్నికలపై సన్నద్ధత.. 9, 10 తేదీల్లో రాష్ట్రానికి సీఈసీ బృందం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
సార్వత్రిక ఎన్నికల సన్నద్ధతపై కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు మరోమారు ఏపీ అధికారులతో సమావేశం కానున్నారు. ఇందులో భాగంగా నెల ఈనెల 9, 10 తేదీల్లో సీఈసీ బృందం రాష్ట్రానికి రానుంది. సీఈసీ రాజీవ్‌ కుమార్‌ నేతృత్వంలో ఎన్నికల కమిషనర్లు అనూప్‌ చంద్రపాండే, అరుణ్‌ గోయెల్‌ కూడా రాష్ట్రానికి వస్తున్నారు. ఏపీ సీఎస్‌, డీజీపీ సహా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ఈ బృందం సమావేశం కానుంది. 2024 ఓటర్ల జాబితా రూపకల్పన, ఓటర్ల జాబితాలో మార్పులు, అవకతవకల అంశం, ఈవీఎంల ఫస్ట్‌లెవల్‌ చెక్‌పై మరోమారు సమీక్షించనున్నారు. రాజకీయ పార్టీలు ఇచ్చిన ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేకంగా సమీక్షించనున్నట్టు సమాచారం. అక్రమ మద్యం, నగదు అక్రమ రవాణా, చెక్‌పోస్టుల ఏర్పాటు, శాంతిభద్రతల అంశంపై చర్చించనున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణతో సంబంధం ఉన్న అధికారుల బదిలీలపై కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *