రాష్ట్రంలో చేపట్టిన జగనన్న ఆరోగ్య సురక్ష, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ఒక మంచి ఆలోచన

-ముఖ్యమంత్రి వై యస్ జగన్ మోహన్ రెడ్డి ఆలోచన స్ఫూర్తి నిస్తోందని ప్రశంస
-టీబీ బాధితునికి నిక్షయ మిత్రా కిట్స్ పంపిణీ
– కేంద్ర మంత్రి ఎస్పీ సింగ్‌ బఘేల్‌

రాజానగరం (లాలా చెరువు) , నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జగనన్న ఆరోగ్య సురక్ష, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ద్వారా ప్రజలకు వైద్య సేవలను మరింత చేరువ చెయ్యడం సాధ్యం అవుతుందని కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ సహాయమంత్రి ఎస్పీ సింగ్‌ బఘేల్‌ స్పష్టం చేసారు.

బుధవారం ఉదయం రాజానగరం మండలం లాలా చెరువు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (సి జి హెచ్ ఎస్) ను కేంద్ర సహాయ మంత్రి ఎస్పీ సింగ్‌ బఘేల్‌  సందర్శించడం జరిగింది. కేంద్ర మంత్రి వెంట కలెక్టర్ కె. మాధవీలత పాల్గొనడం జరిగింది.

ఈ సందర్భంగా కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ సహాయమంత్రి ఎస్పీ సింగ్ బఘేల్‌ మాట్లాడుతూ , కేంద్ర ప్రభుత్వం ప్రజారోగ్యాన్ని అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతోందని అన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం ద్వారా అందచేస్తున్న వివిధ ఆరోగ్య సేవలు వివరాలు తెలుసుకోవడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రజలకు అందచేస్తున్న వివిధ ఆరోగ్య సేవలు వివరాలు తెలుసుకున్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ చేపట్టి ఇంటింటి కి వెళ్లి ప్రజలకి వైద్య సేవలు అందించే కార్యక్రమం సమర్థవంతంగా చేపట్టడం పట్ల కేంద్ర మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రులు ద్వారా వైద్య సేవలు అందించే క్రమంలో ప్రజల వద్దకే వైద్య సేవలు తీసుకుని వెళ్ళే ఆలోచన స్ఫూర్తి కల్పిస్తోందని ఎస్పీ బఘేల్‌ పేర్కొన్నారు. ఆమేరకు వైద్య సేవలు అందించడంతో పాటు, ఉచితంగా పరీక్షలు చెయ్యడం, మందులు అందించడం పట్ల తీసుకుంటున్న చర్యల నేపథ్యం లో ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి చొరవను అభినందించారు. కేంద్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య పరంగా తీసుకుంటున్న చర్యలకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో దోహదం చేసేలా నిలుస్తాయని పేర్కొనడం గమనార్హం. జగనన్న కంటి వెలుగు లబ్దిదారునికి కేంద్ర మంత్రి కంటి అద్దాలు అందచేశారు. పి హెచ్ సి ద్వారా అందచేస్తున్న వైద్య సేవలు నిక్షిప్తం చెయ్యడం ద్వారా ఫాలో అప్ వైద్య సేవలు అందించాలని సూచించారు. ప్రతి వ్యక్తి యొక్క ఆరోగ్య డేటా ఎంట్రీ చెయ్యడం జరుగుతున్నట్లు వైద్యాధికారులు వివరించారు.

అంతకు ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రంలో జగనన్న ఆరోగ్య సురక్ష, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ చేపట్టి ప్రజల వద్దకే వైద్య సేవలు తీసుకుని వెళ్ళడం జరుగుతున్నట్లు జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత కేంద్ర మంత్రి కి వివరించారు. జగనన్న ఆరోగ్య సురక్ష రెండో విడత ఇంటింటి సందర్శన ప్రస్తుతం జరుగు తున్నట్లు , ఆరు నెలలు కు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. తొలి విడత ఆరోగ్య సురక్ష కింద 468 వైద్య శిబిరాలు నిర్వహించి, 231224 మందికి వైద్య సేవలు అందించినట్లు తెలియ చేశారు. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ద్వారా ఇంటి వద్దనే విద్య సేవలు అందించే క్రమంలో ఒక లక్ష 82 వేల గృహాలను సందర్శించినట్లు తెలియ చేశారు. అత్యవసర పరిస్థితుల్లో 108 , 104 అంబులెన్స్ ద్వారా వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో సహాయ కలెక్టరు సి. యస్వంతకుమార్, డియంహెచ్ ఓడా.  కే. వెంకటేశ్వరరావు, డి సి హెచ్ ఎస్ డా ఎమ్. సనత్ కుమారి, స్థానిక నాయకులు సోము వీర్రాజు, వైద్య అధికారులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *