Breaking News

ఎన్నికల విధులను బాధ్యతా తో నిర్వర్తించాలి

-మార్గదర్శకాలు ఖచ్చితంగా పాటించాలి
-సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ్

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గురువారం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం లో ఫ్లయింగ్ స్క్వాడ్, ఎం.సి.సి, వీడియో వ్యువింగ్ టీమ్స్, అకౌంటింగ్ టీమ్స్ కు అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి ట్రై శిక్షణ కార్య్రమము నిర్వహించారు. ఈ సందర్బంగా సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ్ మాట్లడుతూ, రానున్న ఎన్నికల్లో వివిధ బాధ్యతలను కేటాయించిన అధికారులు, సిబ్బంది నిబద్దత కలిగి, జవాబు దారి తనం తో నిర్వహించాల్సి ఉందన్నారు. ఎన్నికల కమీషన్ మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించడం, వాటి కి సంబందించి ఎటువంటి ఎటువంటి సందేహాలు ఉన్నా నివృత్తి చేసుకోవలసి ఉంటుందన్నారు. ఆయా బృందాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలు విషయం లో ఇప్పటికే శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సహాయ కలెక్టర్ సి. యశ్వంత్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *