ప్రభుత్వ స్వయం ప్రతిపత్తి (ఆర్ట్స్) కళాశాల క్షేత్ర పర్యటన…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వ స్వయం ప్రతిపత్తి (ఆర్ట్స్) కళాశాలలో రసాయన శాస్త్ర విభాగం వారు విద్యార్థులలో వైజ్ఞానిక ఉత్సుకతను పెంచే విధంగా మరియు పరిశోధన పరిజ్ఞానం పెంచుకునేలా 70 మంది విద్యార్థులతో బెంగళూరు లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ కి క్షేత్ర పర్యటనకు బయలుదేరారు. ఈనెల 20వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఈ పర్యటన జరగనుంది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కళాశాల ప్రిన్సిపల్ డాll రామచంద్ర ఆర్.కె. మాట్లాడుతూ దేశంలోనే అత్యున్నతమైన పరిశోధనా కేంద్రానికి విద్యార్థులు క్షేత్ర పర్యటనకు వెళ్లడం చాలా గర్వకారణమని, విద్యార్థులకు ఇలాంటి క్షేత్ర పర్యటనలు శాస్త్రీయ దృక్పథాన్ని, పరిశోధనా జిజ్ఞాసను పెంచుకోవడానికి మరియు అనేక వైజ్ఞానిక విషయాలను తెలుసుకోవడానికి సహకరిస్తాయని పేర్కొన్నారు. రసాయన శాస్త్ర విభాగాధిపతి డి. శ్రీనివాస్  మాట్లాడుతూ విద్యార్థులు ఈ పర్యటనలో క్రమశిక్షణతో అత్యంత ప్రతిభావంతమైన శాస్త్రవేత్తల నుండి వారి పరిశోధనల నుండి జ్ఞానాన్ని సంగ్రహించాలని తెలిపారు. ఈ పర్యటనకు రసాయన శాస్త్ర విభాగం నుంచి జాకబ్ గారు, శ్రీధర్, సురేష్, మల్లికార్జున, త్రినాధ్, సురేఖ, శాంత కుమారి, భార్గవి, శ్రావణి మరియు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *