రాజమహేంద్రవరం రూరల్ , నేటి పత్రిక ప్రజావార్త :
రాజమండ్రి పార్లమెంట్ నియోజక వర్గానికి తొలి రోజున అభ్యర్ధులు ఎవ్వరూ నామినేషన్లు దాఖలు చెయ్య లేదని రాజమండ్రి పార్లమెంటు నియోజక వర్గ రిటర్నింగ్ అధికారి/ కలెక్టర్ డా. కే. మాధవీ లత గురువారం ఒక ప్రకటనలో తెలియ చేశారు. ఏప్రియల్ 25 వ తేదీ వరకు ప్రతి రోజు (ఏప్రియల్ 21 ఆదివారం మినహా) ఉదయం 11 గంటల నుంచి మ.3 వరకూ మాత్రమే నామినేషన్లు జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో ఏర్పాటు చేసిన రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో స్వీకరించడం జరుగుతుందని కలెక్టర్ తెలియ చేశారు.
Prajavartha Online Telugu News