నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో హెల్ప్ డెస్క్…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా అదర్ పోలింగ్ ఆఫీసర్ (ఓపిఓ) విధులు కేటాయించబడి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో (95) ఓటు ఉన్న వారి పోస్టల్ బ్యాలెట్ స్వీకరణకు నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామని గుంటూరు నగర కమిషనర్ & తూర్పు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి(ఆర్ఓ) కీర్తి చేకూరి తెలిపారు. గురువారం కమిషనర్ & ఆర్ఓ హెల్ప్ డెస్క్ ని పరిశీలించి పోస్టల్ బ్యాలెట్ స్వీకరణపై సిబ్బందికి తగు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ & ఆర్ఓ మాట్లాడుతూ, గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఓటు కల్గి ఉండి 2024 సాదారణ ఎన్నికల ప్రక్రియలో ఓపిఓ విధులు కేటాయించబడిన ఉద్యోగులకు నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని హెల్ప్ డెస్క్ లో ఫారం-12(2 కాపీలు) అందించాలని తెలిపారు. ఫారం-12తో పాటుగా ఓటర్ ఎపిక్ కార్డ్, డ్యూటీ ఆర్డర్ కాపి ఇవ్వాలన్నారు. హెల్ప్ డెస్క్ సిబ్బంది కార్యాలయ పని వేళల్లో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు విధుల్లో ఉండి, ఫారం-12 అందించే వారి వివరాలను ప్రత్యేక రిజిస్టర్ లో ఏరోజుకు ఆరోజే నమోదు చేయాలని ఆదేశించారు. హెల్ప్ డెస్క్ సిబ్బంది సకాలంలో విధులకు హాజరయ్యేలా, రిజిస్టర్ పక్కాగా మెయిన్టైన్ చేసేలా పర్యవేక్షణ చేయాలని కార్యాలయ మేనేజర్ ఎస్ఎన్ ప్రసాద్ ని ఆదేశించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *