గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా గురువారం నామినేషన్ల నోటిఫికేషన్ ఫారం-1 నోటీసుని నోటీస్ బోర్డ్ ల్లో ఏర్పాటు చేయడం జరిగిందని నగర కమిషనర్ & తూర్పు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి(ఆర్ఓ) కీర్తి చేకూరి తెలిపారు. కమిషనర్ & ఆర్ఓ ఆదేశాల మేరకు నగరపాలక సంస్థలోని తూర్పు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన నోటీస్ బోర్డ్ లో ఫారం-1 నోటీసుని ఏఆర్ఓలు సునీల్, భీమరాజు, ప్రదీప్ కుమార్, మేనేజర్ ప్రసాద్ లు నోటిఫికేషన్ ని అంటించారు.
ఈ సందర్భంగా కమిషనర్ & ఆర్ఓ మాట్లాడుతూ, కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యుల్ మేరకు ఈ నెల 18 నుండి 25 వరకు నామినేషన్లు స్వీకరిస్తామని, ఎన్నికల ప్రక్రియకు సంబందించి ఫారం-1 నోటీసుని ప్రభుత్వ కార్యాలయాల నోటీస్ బోర్డ్ ల్లో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అలాగే 25 వరకు అందిన నామినేషన్లను 26న పరిశీలన చేస్తామని తెలిపారు. 29న నామినేషన్ల ఉప సంహరణకు చివరి తేదీ కాగా మే 13 న ఎన్నికలు, జూన్ 4 న ఓట్ల లెక్కింపు జరుగుతుందని తెలిపారు.
Prajavartha Online Telugu News