ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ పట్ల సంతృప్తి

-రాజమండ్రీ వైపు ఉన్న చెక్ పోస్ట్ మార్చాలి
-ఎన్నికల సాధారణ పరిశీలకులు కమల కంత్ సరోచ్

నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ పగడ్బందీగా నిర్వహించాలని , స్ట్రాంగ్ రూమ్ నిర్వహణా పట్ల, సిబ్బంది పనితీరు పట్ల సంతృప్తి కొవ్వూరు, నిడదవోలు, గోపాల పురం అసెంబ్లి నియోజ క వర్గ ఎన్నికల సాధారణ పరిశీలకు లు కమలకంత్ సరోచ్ అన్నా రు. గురువారం నిడదవోలు అసెంబ్లి నియోజక వర్గ పరిధిలో నిడద వోలు చెక్ పోస్ట్ ను, స్ట్రాంగ్ రూమ్ లను, ఆర్. ఓ నామినేషన్ల ప్రక్రియ విధానాన్ని పరిశీలించారు.

ఈ సందర్భంగా సాధారణ పరిశీలకు లు కమలకంత్ సరోచ్ మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికలలో భాగంగా కొవ్వూరు నిడదవోలు, గోపాలపురం నియోజక వర్గాల పరిధిలో సాధారణ ఎన్నికల పరిశీలకులుగా రిటర్నింగ్ అధికారులు పనితీరు వ్యక్తిగతంగా పర్యవేక్షణ చేస్తున్నట్లు తెలిపారు. నియోజక వర్గ రిటర్నింగ్ అధికారి చేసిన ఏర్పాట్లు, నామినేషన్ దాఖలు ప్రక్రియ సజావుగా నిర్వహించటం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా రిటర్నింగ్ అధికారి ఆర్ వీ రమణ నాయక్ మాట్లాడు తూ నియోజక వర్గ పరిధిలో చేపట్టి న కార్యచరణ ప్రణాళికా పై రిటర్నింగ్ అధికారి వివరించడం జరిగిందన్నారు. నామినేషన్ స్వీకరణ ప్రక్రియ కోసం తగిన జాగ్రత్తలు తీసుకోవడం జరిగిందనీ, అభ్యర్ధులకు వాటి పై అవగాహన కల్పించడం జరిగినట్లు తెలిపారు. అభ్యర్ధుల ప్రచారం, అనుమతులు, కోడ్ ఉల్లంఘన తదితర అంశాలపై సిబ్బంది కి అవగాహన కల్పించడం జరిగిందన్నారు.

నిడదవోలు నుంచి రాజమండ్రీ మార్గంలో ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ ల వద్ద రికార్డులను పరిశీలించి, ఒక్క కేసు నమోదు కావడం పై వివరాలు సేకరించడం జరిగింది. ఈ నేపధ్యంలో మరో మార్గంలో చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి, నివేదిక అందజేయాలని ఆదేశించారు. చాగల్లు వైపు మార్గంలో చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి నివేదిక అందజేయడం జరుగుతుందని రమణ నాయక్ వివరించడం జరిగింది.

తొలుత నియోజక వర్గం లో పర్యటనకు వచ్చిన సాధారణ పరిశీలకు లు కమలకంత్ సరోచ్ ఆర్వో రమణ నాయక్ స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక నామినేషన్ సెల్ (హెల్ప్ డెస్క్) ఏర్పాటు చేశామనీ రాజకీయ పార్టీలకు అవగాహన కల్పించడం జరిగిందని వివరించారు. నామినేషన్లు దాఖలు చెసే విధానంలో ఎన్నికల ప్ర‌వ‌ర్త‌నా నియ‌మావ‌ళిని కచ్చితంగా పాటిస్తు న్నామని తెలిపారు. నామినేషన్ల ప్రక్రియకు నామినేష‌ న్లను స్వీక‌రించే గ‌ది లో వీడియో రికార్డు చేయడం జరుగుతోందన్నారు.

ఈ కార్యక్రమంలో ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ ఎం. భాను ప్రకాష్, అసిస్టెంట్ ఎన్నికల వ్యయ పరిశీలకులు, బి. శ్రీనివాస్, లైజిన్ ఆఫీసర్, డి ఆర్. డి. ఎ, పి.డి, ఎన్. వి. వి. ఎస్ఎన్ మూ ర్తి, ఎఈఆర్ఓ లు వి. నాగభూషణం, కే నవీన్ కు మార్, డి.సుధ తదిత రులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *