రాజానగరం, నేటి పత్రిక ప్రజావార్త :
సాధారణ పరిశీలకులు “కమల్ కాంత్ సరోఛ్” శుక్రవారం నన్నయ్య యూనివర్శిటీ క్యాంపస్ లో ఏర్పాటు చేసిన కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం అసెంబ్లి నియోజక వర్గాల స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించడం జరిగింది. ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ పూర్తి చేసినా తదుపరి మే 13 వ తేదీ రాత్రికి నన్నయ్య యూనివర్సిటీ ఆవరణలో ఆయా నిర్దేశిత స్ట్రాంగ్ రూమ్ లకు చేర్చడం జరుగు తుందనీ అధికారులు వివరించారు. ఈ సందర్బంగా ఆయా నియోజక వర్గాల నుంచి వొచ్చే బ్యాలెట్ యూనిట్స్ స్ట్రాంగ్ రూమ్ లకీ చేరే రూట్ మ్యాప్ తదితర అంశాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.
సాధారణ ఎన్నికల పరిశీలకులుగా ధవళేశ్వరం కాటన్ గెస్ట్ హౌస్ నందు ఉదయం 9 నుంచి 10 వరకు మే 12 వ తేదీ వరకు రాజకీయ పార్టీలకు, ప్రజలకి అందుబాటులో ఉంటామని ఆయన తెలియ చేశారు. ఎన్నికలకి సంబంధించిన ఎటువంటి ఫిర్యాదు లనైనా నేరుగా అందచెయ్యా వచ్చునని, ఫోన్ నంబర్ 8977935106 ను ఫోను ద్వారా ఫిర్యాదు చేయవచ్చునని ఆయన తెలియ చేశారు.
Prajavartha Online Telugu News