విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తనకు గన్నవరం ఎమ్మెల్యేగా ఒ నియోజవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉంటానని గన్నవరం నియోజకవర్గ టిడిపి జనసేనక్క అవకాశం ఇస్తే ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తానని, నియోజవర్గంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తానని గన్నవరం నియోజకవర్గ టిడిపి జనసేన బిజెపి కూటమి అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు భరోసా ఇచ్చారు. శుక్రవారం సాయంత్రం విజయవాడ రూరల్ మండలం ప్రసాదంపాడు గ్రామంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు జనవరి నియోజకవర్గం వివరించటం తోపాటు, గన్నవరం నియోజకవర్గ అభివృద్ధికి తను చేపట్టబోయే సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరించారు. గన్నవరంలో ఐటీ సంస్థలు ఏర్పాటు చేసి నిరుద్యోగ సమస్య పరిష్కరించడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రసాదంపాడు గ్రామంలో కలవకట్ట నివాసితుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. విజయవాడ రూరల్ మండలం ప్రసాదంపాడు, రామవరప్పాడు, ఎనికేపాడు గ్రామాల్లో రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసం టీడీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత విజయవాడ బైపాస్ రోడ్ నిర్మాణపనులు వేగవంతం చేస్తామన్నారు. గన్నవరం నియోజకవర్గంలో అరాచక శక్తుల ఆట కట్టించి ప్రశాంత వాతావరణం నెలకొనేందుకు కృషి చేస్తానన్నారు. నియోజకవర్గంలో అర్హులైన 15000 మందికి పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామన్నారు. రానున్న ఎన్నికల్లో గన్నవరం నియోజకవర్గానికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి తనకు, బందరు పార్లమెంట్ అభ్యర్థి వల్లభనేని బాలసౌరికి గాజు గ్లాస్ గుర్తుపై ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారం నిమిత్తం గ్రామానికి వచ్చిన యార్లగడ్డకు అడుగుతున్న ప్రజలు నీరాజనం పలికారు. పూలమాలలు వేసి, పూల వర్షం కురిపిస్తూ, మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో టిడిపి జనసేన బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News