అడుగు అడుగున జన నీరజనాల మధ్య వసంత విజయ ర్యాలీ

మైలవరం, నేటి పత్రిక ప్రజావార్త :
అంగరంగ వైభవంగా మైలవరం నియోజకవర్గం లోని జి. కొండూరు పట్టణంలో మొదలు అయినా వసంత వెంకట కృష్ణప్రసాద్ ఎన్నికల ప్రచారం. అడుగు అడుగున జన నీరజనాల మధ్య కొనసాగుతున్న వసంత విజయ ర్యాలీ ని తలపించే ఎన్నికల ప్రచారం. మంగళవారం స్థానిక పార్టీ నాయకులు మహిళలతో కలిసి ఎన్డీఏ కూటమి బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ఇంటింటికి వెళ్ళి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటి చేస్తున్న వసంత కృష్ణ ప్రసాదు కి యంపి గా పోటీచేస్తున్న కేశినేని శివనాథ్ కి సైకల్ గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని విజ్ణప్తి చేస్తూ ప్రచారం నిర్వహించారు. అందరిని అప్యాయంగా పలకరిస్తూ బాబు  సూపర్ సిక్స్ పథకాలు గురించి వివరిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమం లో స్థానిక పార్టీ నాయకులు మహిళా నేతలు తెలుగుదేశం, జనసేన బిజెపి పార్టీ నాయకులు అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *