ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఖచ్చితంగా పాటించాలి

-అభ్యర్ధుల సమావేశంలో పాల్గొన్న పరిశీలకులు కమల్ కాంత్

గోపాలపురం, నేటి పత్రిక ప్రజావార్త :
గోపాలపురం ఎస్సి అసెంబ్లి నియోజక వర్గ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులతో సమావేశం నిర్వహించి ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు పై అవగాహన కల్పించడం జరిగిందనీ సాధారణ పరిశీలకులు  కమల్ కాంత్ సరోఛ్, నియోజక వర్గ రిటర్నింగ్ అధికారి కే ఎల్ శివ జ్యోతి తెలియ చేశారు. మంగళవారం ఉదయం స్థానిక తహసీల్దార్ కార్యాలయం నందు సార్వత్రిక ఎన్నికల్లో నిలబడిన గోపాలపురం ఎస్సి అసెంబ్లి నియోజక వర్గ అభ్యర్థులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్బంగా గోపాలపురం రిటర్నింగ్ అధికారి కే ఎల్ శివ జ్యోతి మాట్లాడుతూ, సోమవారం నామినేషన్లు స్క్రూటిని ఉపసంహరణ అనంతరం 10 మంది అభ్యర్దులు పోటిలో ఉన్నట్లు తెలిపారు. ఇప్పటికే పోటిలో నిలిచిన అభ్యర్థులకు ఎన్నికల కమిషన్ నిర్దేశించిన నియమావళి అందజేయడం జరిగిందన్నారు. ఖర్చులకి సంబందించి ఈరోజు ఖర్చులు ఆరోజు జవాబుదారీతనం కలిగి ఉండేలా ఆర్వో సంతకం తో కూడిన రిజిస్టర్ అందచేశమని, సంభందిత ఖర్చులను ఎప్పటి కప్పుడు అకౌంటింగ్ బృందాలతో నిర్దారణ చేసుకోవలన్నారు. ప్రచారం, పర్యటన నేపథ్యంలో అనుమతులు తప్పనిసరి అని పేర్కొన్నారు. రానున్న 12 రోజులు ఈరోజు ఏ కార్యక్రమం నిర్వహిస్తున్నమో అభ్యర్థులకు ముందుగా తెలియ చేయనున్నట్లు తెలిపారు. ర్యాండమైజేషన్, హోం ఓటింగు, పొలింగ్ సిబ్బంది కి పోస్టల్ బ్యాలెట్, మైక్రో అబ్జర్వర్స్, అత్యవసర సేవలు నిర్వహించే వారికి ఏ ఏ రోజుల్లో పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ ఉంటుందో సమాచారం అందించి రశీదు తీసుకోవడం జరుగుతుందని అన్నారు.

ఈ సందర్బంగా కమల్ కాంత్ సరోఛ్ మాట్లాడుతూ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పోటిలో ఉన్న అభ్యర్థులు ఖచ్చితంగా పాటించాలని కోరారు. అనుమతులకు లోబడి అసెంబ్లి నియోజక వర్గ పరిధిలోనే పర్యటనలు ఉండాలని కోరారు. నియోజక వర్గ సాధారణ ఎన్నికల పరిశీలకులుగా ధవళేశ్వరం కాటన్ గెస్ట్ హౌస్ నందు ఉదయం 9 నుంచి 10 వరకు మే 12 వ తేదీ వరకు రాజకీయ పార్టీలకు, ప్రజలకి అందుబాటులో ఉంటామని తెలియ చేశారు. ఎన్నికలకి సంబంధించిన ఎటువంటి ఫిర్యాదులనైనా నేరుగా అందచెయ్యా వచ్చునని, లేదా ఫోన్ నంబర్ 8977935106 ను ఫోను ద్వారా ఫిర్యాదు చేయవచ్చునని ఆయన తెలియ చేశారు.

వ్యయ పరిశీలకులు రోహిత్ నగర్ మాట్లాడుతూ, ఖర్చుల విషయంలో ఖచ్చితత్వం పాటించాలని స్పష్టం చేశారు. అభ్యర్థులకు నిర్దేశించిన విధంగా ఖర్చులు 40 లక్షలకు మించకుండా చూసుకోవాలి అని పేర్కొన్నారు. విజిలెన్స్ అధికారులు క్షేత్ర స్థాయిలో తనిఖీలు నిర్వహించి, ఆయా అభ్యర్ధులు ఖాతాలో ఖర్చులుగా చూపడం జరుగుతుంది అన్నారు.

ఈ సమావేశంలో తాహసిల్దర్ వనజాక్షి, ట్రైనీ డిప్యూటి కలెక్టర్ పి. సువర్ణ, పోటీలో నిలిచిన అభ్యర్థులు, వైఎస్సార్ సీపి , టిడిపి తరఫున ప్రతినిథులు, బిఎస్ పి – భారత రావు సిర్రా, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ – పొడదాసి మార్టిన్ లూధర్, జాతీయ జనసేన పార్టీ – పెనుమాక వెంకటరత్నం, ఆల్ ఇండియా పార్వర్డ్ బ్లాక్ – బాతుల వేణు, జై భారత్ నేషనల్ పార్టీ – ములగాల శ్రీనివాసరావు … స్వతంత్ర అభ్యర్థులు దొడ్డిగర్ల నాగార్జున, ముక్కవల్లి వెంకటరమణ, రాపాక హరీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *