-అభ్యర్ధుల సమావేశంలో పాల్గొన్న పరిశీలకులు కమల్ కాంత్
-ఎన్నికల ఖర్చులను ఖచ్చితంగా ఆడిటింగ్ చెయ్యాలి
-ఎన్నికల పరిశీలకులు
నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త :
నిడదవోలు అసెంబ్లి నియోజక వర్గ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులతో సమావేశం నిర్వహించి ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు పై అవగాహన కల్పించడం జరిగిందనీ సాధారణ పరిశీలకులు కమల్ కాంత్ సరోఛ్, నియోజక వర్గ రిటర్నింగ్ అధికారి ఆర్ వీ రమణ నాయక్ తెలియ చేశారు.
మంగళవారం ఉదయం స్థానిక గ్రామ కచేరీ నందు సార్వత్రిక ఎన్నికల్లో నిలబడిన నియోజక అసెంబ్లి నియోజక వర్గ అభ్యర్థులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా రిటర్నింగ్ అధికారి ఆర్ వీ రమణ నాయక్ మాట్లాడుతూ, సోమవారం నామినేషన్లు స్క్రూటిని ఉపసంహరణ అనంతరం 12 మంది అభ్యర్దులు పోటిలో ఉన్నట్లు తెలిపారు. ఇప్పటికే పోటిలో నిలిచిన అభ్యర్థులకు ఎన్నికల కమిషన్ నిర్దేశించిన నియమావళి అందజేయడం జరిగిందన్నారు. ఖర్చులకి సంబందించి ఏ రోజు ఖర్చులు ఆరోజు అందచేసేందుకు జవాబుదారీతనం కలిగి ఉండేలా ఆర్వో సంతకం తో కూడిన రిజిస్టర్ అందచేశామని, సంబంధిత ఖర్చులను ఎప్పటి కప్పుడు అకౌంటింగ్ బృందాలతో నిర్దారణ చేసుకోవలన్నారు. ప్రచారం, పర్యటన నేపథ్యంలో అనుమతులు తప్పనిసరి అని పేర్కొన్నారు. రానున్న 12 రోజులు ఈరోజు ఏ కార్యక్రమం నిర్వహిస్తున్నమో అభ్యర్థులకు ముందుగా తెలియ చేయనున్నట్లు తెలిపారు. ర్యాండమైజేషన్, హోం ఓటింగు, పొలింగ్ సిబ్బంది కి పోస్టల్ బ్యాలెట్, మైక్రో అబ్జర్వర్స్, అత్యవసర సేవలు నిర్వహించే వారికి ఏ ఏ రోజుల్లో పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ ఉంటుందో సమాచారం అందించి రశీదు తీసుకోవడం జరుగుతుందని అన్నారు.
ఈ సందర్బంగా కమల్ కాంత్ సరోఛ్ మాట్లాడుతూ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పోటిలో ఉన్న అభ్యర్థులు ఖచ్చితంగా పాటించాలని కోరారు. అనుమతులకు లోబడి అసెంబ్లి నియోజక వర్గ పరిధిలోనే పర్యటనలు ఉండాలని కోరారు. నియోజక వర్గ సాధారణ ఎన్నికల పరిశీలకులుగా ధవళేశ్వరం కాటన్ గెస్ట్ హౌస్ నందు ఉదయం 9 నుంచి 10 వరకు మే 12 వ తేదీ వరకు రాజకీయ పార్టీలకు, ప్రజలకి అందుబాటులో ఉంటామని తెలియ చేశారు. ఎన్నికలకి సంబంధించిన ఎటువంటి ఫిర్యాదులనైనా నేరుగా అందచెయ్యా వచ్చునని, లేదా ఫోన్ నంబర్ 8977935106 ను ఫోను ద్వారా ఫిర్యాదు చేయవచ్చునని ఆయన తెలియ చేశారు.
వ్యయ పరిశీలకులు రోహిత్ నగర్ మాట్లాడుతూ, ఖర్చుల విషయంలో ఖచ్చితత్వం పాటించాలని స్పష్టం చేశారు. అభ్యర్థులకు నిర్దేశించిన విధంగా ఖర్చులు 40 లక్షలకు మించకుండా చూసుకోవాలి అని పేర్కొన్నారు. విజిలెన్స్ అధికారులు క్షేత్ర స్థాయిలో తనిఖీలు నిర్వహించి, ఆయా అభ్యర్ధులు ఖాతాలో ఖర్చులుగా చూపడం జరుగుతుంది అన్నారు.
ఈ సమావేశంలో తాహసిల్దర్ వి .నాగ భూషణం , తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News