విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
11వ డివిజన్, రెల్లీస్ కాలనీ, హై స్కూల్ రోడ్, విశాల్ మార్ట్ రోడ్, వీరభనేని ప్లాజా ప్రాంతాలలో తూర్పు నియోజకవర్గ వైసిపి అభ్యర్థి దేవినేని అవినాష్ మరియు స్థానిక ఇంచార్జ్ పర్వతనేని పవన్..ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ రెల్లిస్ కాలని వద్ద నుంచి కరణం గారి బజార్ వరకు ఇంటింటికి ప్రచారం చేశామన్నారు. గద్దె రామ్మోహన్ ఎంఎల్ఏ గా ఉన్న పది సంవత్సరాలపాటు నియోజకవర్గంలో ఏ అభివృద్ది చేయలేకపోయాడన్నారు. వైసిపి హయంలో జగన్ సహకారంతో 650 కోట్ల అభివృద్ది పనులు చేశామన్నారు. రేల్లిస్ కాలనిలో ఇళ్ళ పట్టాలు రిజిస్ట్రేషన్ జగన్ ప్రభుత్వం పూర్తి చేసిందన్నారు. రిజిస్ట్రేషన్ లు అవ్వటం వలన అక్కడ ప్రజలు ఏంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు. పది లక్షలు రూపాయలు తమ ఇళ్ళకు వచ్చయాన్నంత ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తాము మంచి చేశాం కాబట్టే ధైర్యంగా ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అడుగుతున్నామన్నారు. గద్దె రామ్మోహన్ ఏం మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతారన్నారు. కాల్ మని, బెట్టింగ్,సెక్స్ రాకెట్,గంజాయి లాంటి వాటిని ప్రోత్సహిస్తుంది గద్దె రామ్మోహన్ అన్నారు. టిడ్కో ఇళ్ళ పేరుతో డబ్బులు వసూలు చేసింది టీడీపి నేతలన్నారు. జగన్ మ్యానిఫెస్టో టీడీపి కాపీ కొట్టిందన్నారు. చంద్రబాబు బ్యాక్ బెంచ్ స్టూడెంట్ కాపీ కొట్టడంలో స్పెషలిస్ట్ అన్నారు. బీజేపీ కూడా టీడీపి చేస్తున్న పనులకు అప్పుడే దూరం అవుతుందన్నారు. జగన్ చేసిన పనులే మేము చేస్తాం అంటే చంద్రబాబు కి ప్రజలు ఓట్లు వేయాలన్నారు. అభివృద్ది పనులను అడ్డుకుంటుంది గద్దె రామ్మోహన్ కుటుంబం అని అన్నారు. మూడవ డివిజన్ లో రోడ్ నిర్మాణ పనులను అడ్డుకుంది గద్దె అనురాధ అని అన్నారు. మీరు అబద్ధాలు చెప్పితే నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరన్నారు. గద్దె రమేష్ అనే కాంట్రాక్టర్ కి లాభం చేకూర్చాలని రోడ్డు పనులు అపించేశారన్నారు. మేము నియోజకవర్గ వ్యాప్తం గా రోడ్లు వేసిన ఏ ఒక్కరి దగ్గర నుంచి రూపాయి కూడా తీసుకోలేదన్నారు. గద్దె రమేష్ నుంచి గద్దె రామ్మోహన్ డబ్బులు తీసుకున్నారన్నారు. అలాంటి డబ్బులుతోనే కాల్ మని, బెట్టింగ్, సెక్స్ రాకెట్ గద్దె రామ్మోహన్ నడిపారన్నారు. ప్రజలకు ఆన్ని విధాలుగా అండగా ఉన్న నన్ను ఆశీర్వదించండన్నారు. మీరు ఒక్క అవకాశం ఇస్తే మి ఇంట్లో బిడ్డలాగ సేవ చేసుకుంటా అని అన్నారు. ఎన్నికల సమయంలో మాత్రమే కనిపించే టీడీపి నేతలు నీ ప్రజలు నమ్మవద్దన్నారు.
Prajavartha Online Telugu News