ప్రజా రాజధానిగా అమరావతి ఇక్కడే ఉంటుంది… : వసంత కృష్ణ ప్రసాదు

మైలవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజా రాజధానిగా అమరావతి ఇక్కడే ఉంటుందని ఎన్డీఏ కూటమి అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాదు అన్నారు. చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులు పూర్తి చేసి సాగునీటి సమస్య తీర్చడం జరుగుతుందన్నారు. పేదలందరికి ఉచ్చితంగా ఇసుక అందించడం జరుగుతుందన్నారు. ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పనే లక్ష్యంగా పనిచేసే వ్వక్తి చంద్రబాబు అని అన్నారు. విజయవాడ రూరల్ మండలం షాబాద్ జక్కంపూడి గ్రామాల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాదు బుధవారం ఎన్నికల ప్రచార యాత్ర సాగిందన్నారు. గ్రామస్తులు అపూర్వ ఆదరణ చూపి అత్మీయ స్వాగతం పలికగా జన సైనికులు వెంట రాగా కమలనాధులు కధం తోక్కుతూ ముందుకు సాగారన్నారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థులైన వసంత కృష్ణ ప్రసాదు, కేశినేని శివనాథ్ (చిన్ని)ల విజయాన్ని కాంక్షిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచార రథం పై నుంచి ప్రజలకు అభివాదం చేస్తూ చంద్రబాబు మ్యానిఫెస్టో గురించి వివరిస్తూ ప్రజా పాలన కావాలంటే చంద్రబాబు  రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమం లో జనసేన, బిజెపి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *