అధిక శాతం పోలింగ్ జరిగేటట్లు తగిన చర్యలు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మైలవరం, నందిగామ, జగ్గయ్యపేట అసెంబ్లీ నియోజక వర్గాల సాధారణ పరిశీలకులు నరేందర్ సింగ్ బాలి మైలవరం నియోజకవర్గం మైలవరం మండలంలోని మైలవరం, పుల్లూరు, వెళ్వడం, గణపవరం, చంద్రాల గ్రామాలలోని పోలింగ్ కేంద్రాలలో చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. విద్యుత్తు, ఫ్యాన్లు, త్రాగునీరు, మరుగుదొడ్లు, షామియానా వసతులను సక్రమంగా ఉండేటట్లు చర్యలు తీసుకోమని బిఎల్ఓ లను ఆదేశించారు. అధిక శాతం పోలింగ్ జరిగేటట్లు తగిన చర్యలు తీసుకోమని ఆదేశించారు. మైలవరం లోని లక్కిరెడ్డి లక్ష్మి రెడ్డి ఇండోర్ స్టేడియం లో ఉన్న ఈవీఎం మాక్ పోల్ సెంటర్ , లక్కిరెడ్డి బాల్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన ఎలక్షన్ స్టాఫ్ శిక్షణా తరగతులను, పోస్టల్ బ్యాలట్ ఫెసిలిటేషన్ సెంటర్ లో పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియను పరిశీలించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *