మే 12 , 13 తేదీల్లో పత్రికల్లో ఇచ్చే రాజకీయ ప్రకటనలకు అనుమతి తప్పనిసరి

-వార్త పత్రికలు ఎమ్ సి ఎమ్ సి ఉత్తర్వుల మేరకు మాత్రమే అటువంటి ప్రకటనలు ప్రచురించాలి
-తూర్పు గోదావరి జిల్లా ఎన్నికల అధికారి మాధవీలత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
మే 13 వ తేది సోమవారం జరగనున్న సాధారణ ఎన్నికల సందర్భంగా పోటీ చేస్తున్న అభ్యర్థులు గాని, ఇతరులు గాని వారికి సంబంధించిన ఎన్నికల రాజకీయ ప్రయోజనం నేపథ్యంలో ప్రింట్ మీడియా (వార్తాపత్రికల)లో మే 12 , 13 తేదీలలో జారీ చేసే ప్రచార ప్రకటనలు మీడియా పర్యవేక్షణా మరియు మీడియా ధ్రువీకరణ (ఎమ్ సి ఎమ్ సీ) విభాగం నుండి ముందస్తు అనుమతి పొందాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా కె. మాధవీలత బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం మే 12, 13వ తేదీలలో వార్తాపత్రికల్లో (ప్రింట్ మీడియాలో) ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు లేదా ఎవరైనా సరే ఎన్నికల రాజకీయ ప్రయోజనం కోసం ప్రచార ప్రకటనలు ప్రచురించుకోవాలంటే రెండు (2) రోజులు ముందుగా అనుమతి పొందడం తప్పనిసరి అని పేర్కొన్నారు.

ఈ నేపధ్యంలో జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన “మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ(ఎంసీఎంసీ) ” ని సంప్రదించి దరఖాస్తులు అందజేసి వారికి కావలసిన అనుమతులు ముందస్తుగా పొందాలని తెలియ చేశారు.

అలాగే వార్తాపత్రికలు( ప్రింట్ మీడియా) యాజమాన్యం కూడా ఈ విషయం గమనించి వారి పత్రికలలో ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల, ఇతరులు మే 12 , 13 తేదీల్లో ఇచ్చే రాజకీయ ప్రచార ప్రకటనలు ప్రచురించే ముందు తప్పనిసరిగా ఎం సి ఎం సి నుండి పొందిన అనుమతి ధ్రువీకరణ పత్రాన్ని పరిశీలించిన తదుపరి మాత్రమే వారి పత్రికలలో ఆయా ప్రకటన లు ప్రచురించాలని తెలియ చేశారు.

కావున తూర్పు గోదావరి జిల్లా పరిధిలో పోటీ చేస్తున్న అభ్యర్థులు, ఇతరులు తమ రాజకీయ ప్రచార ప్రకటనలకు ముందస్తు అనుమతులు పొంది, ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు ఖచ్చితంగా పాటించాలని, జిల్లా ఎన్నికల యంత్రాంగానికి సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి రాజకీయ పార్టీల ప్రతినిధులు, పోటీ చేస్తున్న అభ్యర్థులు, ఇతరులను కోరడం జరిగింది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *