-కౌంటింగ్ ప్రక్రియ సజావుగా జరిగేలా సిబ్బంది తమ విధులను సమర్థవంతంగా నిర్వర్తించాలి.
-ఎన్నికల ఫలితాలు ప్రకటనలో కౌంటింగ్ సిబ్బంది పనితీరు కీలకం
-విధుల్లో భాగంగా సంయమనం పాటించాలి
-కలెక్టర్, ఎన్నికల అధికారి డా. మాధవీలత
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జిల్లాలో కౌంటింగ్ ప్రక్రియ సజావుగా జరిగేలా సిబ్బంది తమ విధులను సమర్థవంతంగా నిర్వర్తించాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా. మాధవీలత ఆదేశించారు.
సోమవారం స్థానిక శ్రీ వెంకటేశ్వర ఆనం కళాకేంద్రంలో కౌంటింగ్ సూపర్‌వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లు, మైక్రో అబ్జర్వర్‌లకు
జూన్ 4 వ తేదిన నన్నయ్య యూనివర్సిటీలో నిర్వహించు కౌంటింగ్ ప్రక్రియ పై అందిస్తున్న శిక్షణా కార్యక్రమం కలెక్టర్, జిల్లా ఎన్నిక అధికారి డా. కే మాధవీలత అధ్యక్షతన జరిగింది.
ఈ సందర్బంగా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డా. కే. మాధవీలత మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికలు -2024 కౌంటింగ్ విధులు నిర్వహించే అధికారులు ఎటువంటి తప్పిదాలు లేకుండా సమర్దవంతం గా నిర్వహించాలని ఆదేశించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ పారదర్శకంగా పకడ్బందీగా జరగాలని, ఏ చిన్న పొరపాటుకు తావివ్వరాదన్నారు. కౌంటింగ్ హాల్లోకి మొబైల్ ఫోన్లు అనుమతించబడవన్నారు. సిబ్బందికి శిక్షణ కార్యక్రమంలో ఎన్నికల కమిషన్ నిర్దేశించిన మార్గదర్శకాలు పై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. జిల్లాలో ఓట్ల లెక్కింపు కౌంటింగ్ కేంద్రాలను వివిధ బ్లాక్ లలో ఏర్పాటు చేశామని తెలిపారు. అసెంబ్లీ పార్లమెంటు సెగ్మెంట్ల వారీగా ఓట్ల లెక్కింపు పక్కాగా జరిగేలా పర్యవేక్షణ ఉంటుందన్నారు. కౌంటింగ్ ఉదయం 8:00 గంటలకు ప్రారంభమవుతుందని, నిర్ణీత సమయానికి ఓట్ల లెక్కింపు ప్రారంభించాలన్నారు. ఎలాంటి తప్పిదాలకు ఆస్కారం లేకుండా ఎన్నికల సంఘం నిబంధనలు పాటించాలని సూచించారు. ఓట్ల లెక్కింపు సమయంలో ఈవీఎంలలో ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తితే సంబంధిత నిపుణులు అందుబాటులో ఉండి సరి చేస్తారని తెలిపారు. ఎటువంటి ఘటనలు చోటు చేసుకున్న ఆసందర్భాల్లో సంయమనం పాటించాలని కోరారు. ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా అన్ని సెగ్మెంట్లలో ఓట్ల లెక్కింపుకు ప్రతి హాల్‌లో 14 టేబుళ్లు ఏర్పాటు చేస్తున్నామని, రౌండ్ల వారీగా కౌంటింగ్ జరుగుతుందని తెలిపారు. ప్రతి టేబుల్‌కు ఒక మైక్రో అబ్జర్వర్, కౌంటింగ్ సూపర్వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్ ఉంటారన్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో పారదర్శకంగా కౌంటింగ్ జరగడంలో మైక్రో అబ్జర్వర్ల పాత్ర చాలా కీలకమైందన్నారు. మైక్రో అబ్జర్వర్లు రౌండ్ వారీగా ప్రతి రిపోర్ట్‌ను కేంద్ర ఎన్నికల కమిషన్ నియమించిన ఎన్నికల అబ్జర్వర్లకు ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. కౌంటింగ్ ప్రక్రియలో ఏ సమస్య ఉన్నా అందుబాటులో ఉంచిన ఏఆర్వోకు తెలపాలని సూచించారు.
కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి అన్ని విషయాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. నిబంధనలను పాటిస్తూ, పూర్తి పారదర్శకంగా నిబద్ధతతో విధులు నిర్వర్తించాలని హితవు పలికారు. కౌంటింగ్ హాల్‌లో ఉండే ఏర్పాట్లు, కౌంటింగ్ ప్రక్రియలో పాటించాల్సిన ఆయా విషయాలపై పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఎలక్ట్రానిక్ మెషిన్ కౌంటింగ్‌కి సంబంధించిన సందేహాలను నివృత్తి చేశారు. ఈ సందర్భంగా వీవీ ప్యాట్ స్లిప్పుల కౌంటింగ్, పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు కు సంబంధించిన ఆయా ప్రక్రియను వివరించారు. కౌంటింగ్ సిబ్బంది ప్రతి ఒక్కరు జాగ్రత్తగా విధులు నిర్వర్తించాలని కోరారు. కౌంటింగ్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.శిక్షణా సమావేశానికి ఏడు నియోజక వర్గాల పరిధిలో ఉన్న మొత్తం 1100 మంది పాల్గొన్నారు.
ఓట్ల లెక్కింపు కార్యాచరణ ప్రణాళిక :
ఉదయం 5 గంటలకు నుంచి కౌంటింగ్ సిబ్బంది టేబుల్స్ కేటాయింపు ర్యాండమెజేషన్ ప్రక్రియ చేపట్టడం జరుగుతుందని, ఆరు గంటల నుంచి ఉ.6.30 లోగా కౌంటింగ్ సిబ్బంది విధులకు రిపోర్ట్ చేయాలన్నారు. స్వల్ప విరామం తరువాత ఉదయం 7.30 నుంచి 7.45 వరకు పోస్టల్ బ్యాలెట్ స్ట్రాంగ్ రూమ్ నుంచి కౌంటింగ్ కేంద్రంకు తరలింపు చేయనున్నట్లు తెలిపారు. ఉదయం 8 గంటలకి ఈటిపీబీఎస్ , పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభం చేయాలనీ, ఉదయం 8.30 నుంచి ఈ వి ఎమ్ యూనిట్స్ లలో పోలైన ఓట్లు లెక్కింపు ప్రారంభం చేయనున్నట్లు తెలిపారు.
పోస్టల్ బ్యాలెట్‌లను నిర్వహించడం, ఎలక్ట్రానిక్‌గా ట్రాన్స్‌మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్ (ETBPS), ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్‌లు (EVM) మరియు ఓటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రైల్స్ (VVPAT ట్రయల్స్) వంటి వివిధ అంశాలను కవర్ చేసిందన్నారు. చట్టపరమైన నిబంధనలు, టేబుల్ లేఅవుట్‌లు, కౌంటింగ్ టేబుల్‌లోని అధికారుల విధులు మరియు కౌంటింగ్ సూపర్వైజర్లు, అసిస్టెంట్ మరియు మైక్రో అబ్జర్వర్‌ల పాత్రలు ముఖ్య అంశాలలో ఉన్నాయిని, ఓటు గోప్యతను కాపాడుకోవడం యొక్క ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు మరియు EVM మరియు పోస్టల్ బ్యాలెట్ గణనను ప్రారంభించ డానికి ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు గురించి వివరించారు. అదనంగా, ఫారమ్ 13 A, 13 B,13 C మరియు 17 C లపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్ మాట్లాడుతూ , ఓటు హక్కు యొక్క గోప్యత పాటించడం అత్యంత ప్రాధాన్యత కలిగి ఉందని తెలిపారు. ఉల్లంఘనకు పాల్పడిన వారిపై మూడు నెలల జైలు శిక్ష, పరిహారం లేదా రెండు విధించే అవకాశం ఉందని పేర్కొన్నారు. రాజమండ్రి సిటీ, రూరల్ నియోజక వర్గ పరిధిలో పోస్టల్ బ్యాలెట్ ఎక్కువ స్ధాయిలో రావడం వల్ల ప్రత్యేకంగా కౌంటింగ్ ప్రక్రియ చేపట్టామని, మిగిలిన ఐదు నియోజక వర్గాల పోస్టల్ బ్యాలెట్ లో ఆయా అసెంబ్లి నియోజక వర్గాల కౌంటింగ్ కేంద్రాలలో చేపట్టనున్నట్లు తెలిపారు.
కౌంటింగ్ ప్రక్రియపై మాస్టర్ ట్రైనీలు, ఎం.దివాకర్, ఎం. రామకృష్ణ, టి సూర్యచంద్ర రావు, పవర్ పాయింట్ ప్రజెంటే షన్ ద్వారా వివరించారు.
ఈ శిక్షణ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో నియోజక వర్గం ఆర్. ఓ.లు రాజమండ్రీ రూరల్ ఆర్వో జె సి – ఎన్. తేజ్ భరత్, రాజమండ్రి అర్బన్ ఆర్వో, మునిసిపల్ కమిషనర్ కే. దినేష్ కుమార్, కొవ్వూరు ఆర్వో , సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ్ , డి ఆర్వో జీ. నరసింహులు, రాజానగరం ఆర్వో/ ఆర్డీఓ ఏ. చైత్ర వర్షిణి, గోపాలపురం ఆర్వో – కె ఎల్ శివజ్యోతి, అనపర్తి ఆర్వో ఎమ్. మాధురీ, నిడదవోలు ఆర్వో ఆర్.వి.రమణా నాయక్ , రాజమండ్రీ పార్లమెంటు సహయ రిటర్నింగ్ అధికారి – ఎస్.డి.సి. ఆర్.కృష్ణా నాయక్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్లు ఎమ్. భాను ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News