కౌంటింగ్ కేంద్రంలో నియమ నిబంధనల ఖచ్చితంగా అమలు

-కౌంటింగ్ కేంద్రం లోకి అనుమతి కలిగిన వారికే ప్రవేశం
-మూడంచెల భద్రత ఏర్పాట్లు పూర్తి చేశాం
-కౌంటింగ్ సిబ్బంది, మైక్రో అబ్జర్వర్స్ శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది
– జిల్లా ఎన్నికల అధికారి మాధవీలత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
సార్వత్రిక ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం నుంచి పూర్తి అయ్యే వరకు బాధ్యత కలిగి ఉండడం , అందుకోసం నియమ నిబంధనలు విషయంలో ఖచ్చితత్వం పాటించడంపై అవగాహన కల్పించి శిక్షణ ఇవ్వడం జరిగిందని కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డా కె. మాధవీలత తెలియ చేశారు.

సోమవారం న్యూ ఢిల్లీ నుంచి కేంద్ర ప్రథాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ , ఎన్నికల కమిషనర్ లు జ్ఞానేశ్ కుమార్ , సుఖ్ బీర్ సింగ్ సందు లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కౌంటింగ్ ప్రక్రియ పై రాష్ట్ర, జిల్లా ఎన్నికల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. స్ధానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్ మాధవీలత పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ కె . మాధవీ లత మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా జూన్ 4 న చేపట్టనున్న ఎన్నికల కౌంటింగ్ నేపధ్యంలో తొలిదశ కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించామన్నారు. కౌంటింగ్ కేంద్రం లోకి కౌంటింగ్ సిబ్బంది, ఎన్నికల కమిషన్ గుర్తింపు కార్డులు జారీ చేసిన వారిని , ఎన్నికల విధుల్లో భాగస్వామ్యం అయ్యే ఎన్నికల సిబ్బంది, అభ్యర్ధులను, ఎన్నికల ఏజెంట్స్, కౌంటింగ్ ఏజెంట్స్ లని మాత్రమే అనుమతించడం జరుగుతుందనీ తెలిపారు. నియోజక వర్గాల వారీగా గుర్తింపు కలర్ కోడ్ ఇస్తున్నట్లు తెలిపారు. వారిని తప్ప కౌంటింగ్ హాల్‌లోకి ఇతర వ్యక్తులను అనుమతించడం జరగదన్నారు . ఇందుకోసం ఇప్పటికే రాజకీయ పార్టీలకు, అభ్యర్ధులకు, ఏజెంట్స్ కు అవగాహన కల్పించడం జరిగిందని పేర్కొన్నారు. కౌంటింగ్ సిబ్బంది , ఈ సి ఐ ద్వారా గుర్తించిన అధికారం పొందిన వ్యక్తులు, ఎన్నికల విధులు సంబంధించి ప్రభుత్వ అఅభ్యర్థులు, ఎన్నికల ఏజెంట్లు & కౌంటింగ్ ఏజెంట్లను మాత్రమే అనుమతిస్తామని, పోలీసులకు కౌంటింగ్ కేంద్రం లోకి అనుమతించడం జరగదని, ఆమేరకు చర్యలు తీసుకోవడం జరుగుతున్నట్లు తెలిపారు. కౌంటింగ్ కేంద్రం వద్ద మూడంచెల భద్రత ఏర్పాట్లు చేశామని , సిసిటివి 24 x 7 నిఘా వ్యవస్థ ఏర్పాటు చేసినట్లు, కమాండ్ కంట్రోల్ రూం ద్వారా పర్యవేక్షణా చేస్తున్నట్లు తెలిపారు. యూనివర్సిటీ ఆవరణలో నో స్మోకింగ్ జోన్ గా, ఒక కీలో మీటరు పరిధిలో 144 సెక్షన్ అమలులో ఉన్నట్లు తెలిపారు.

కౌంటింగ్ కేంద్రాలలో ఓట్ల గోప్యత పాటించడం లో చర్యలలో భాగంగా వెబ్‌కాస్టింగ్ , వీడియోగ్రఫీ చేపట్టడం లేదని మాధవీలత తెలియ చేయడం జరిగింది. ఎన్నికల కమిషన్ జారీ చేసిన మీడియా ఆధారటీ లేఖలు మార్గదర్శకాల మేరకు జారీ చేస్తున్నట్లు తెలిపారు. జూన్ 2 వ తేదీన కౌంటింగ్ కోసం ముందస్తు చర్యల్లో భాగంగా ట్రైల్ రన్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *