రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
స్వామి వివేకానంద యువజన సమితి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న క్విజ్ 2025 పోటీల్లో పాల్గొని విద్యార్థులు వారిలోని సృజనాత్మకతను ప్రదర్శించే చక్కటి అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ డా కె మాధవీలత పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరు ఛాంబర్ లో క్విజ్ 2025 బ్రౌచేర్ ను కలెక్టరు మాధవీలత, డి ఆర్వో జి.నరసింహులు, నిర్వాహకులు రాఘవేంద్ర రావు లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, విద్యార్థుల్లో దాగున్న ప్రతిభను గుర్తించి, వారిని ప్రోత్సహించడం ద్వారా స్వామి వివేకానంద యువజన సమితి చర్యలు తీసుకోవాడంలో జిల్లా విద్యా అధికారి అధికారి ద్వారా అందరికీ సమాచారం తెలియ చేయాలని సూచించారు. క్విజ్ పోటీలలో జనరల్ నాలెడ్జి, కరెంట్ అఫైర్స్, వివేకానంద రచనలు పై పోటీలను నిర్వహించానున్నట్లు నిర్వాహకులు కలెక్టర్ కు వివరించారు. మూడు కేటగిరీలలో పాఠశాల స్థాయిలో పోటీలను నిర్వహించనున్నట్లు, ఆయా విభాగాల్లో గెలుపొందిన విజేతలకు 2025 జనవరి 12 వ తేదీన వివేకానంద స్వామీ జయంతి సందర్భంగా లాప్ టాప్ తదితర బహుమతులు అందజేయ్యనున్నట్లు తెలియ చేశారు.
కార్యక్రమ నిర్వాహకులు ఎస్.రాఘవేంద్రరావు వివరాలు తెలియ చేస్తూ, వివేకానంద క్విజ్ 2025 లో జూనియర్ విభాగంలో 5, 6 తరగతుల విద్యార్థులకు, సీనియర్ విభాగంలో 7, 8 తరగతుల విద్యార్థులకు, మాస్టర్ విభాగంలో 9, 10 తరగతుల విద్యార్థులకులతో మూడు విభాగాల్లో నాలుగు దశల్లో స్క్రీనింగ్, ప్రాధమిక, సెమీ ఫైనల్స్ మరియు ఫైనల్స్ విధానంలో పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆయా తరగతుల విద్యార్థులకు వారి తరగతి సబ్జెక్టు లతో పాటుగా జనరల్ నాలెడ్జి, కరెంట్ అఫైర్స్, వివికానంద సాహిత్యం వంటి అనేక అంశాల్లో ప్రశ్నలు ఉంటాయని తెలియ చేశారు..ఇతర వివరాలకు 9441781525 కు సంప్రదించాలని కోరారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం అయినట్లు, విజేతలకు అనేక విలువైన బహుమతులు ఇవ్వనున్నట్లు తెలిపారు. రిజిస్ట్రేషన్ ఫీజు 100 చెల్లించిన వారికి రూ.1000 విలువైన
Kautilya Education App ఉచితంగా ఇవ్వబడునని పేర్కొన్నారు. ఎంపిక విధానం లో కనీసం వంద మంది ఉన్న ప్రతి విద్యా సంస్థకు స్క్రీనింగ్ పరీక్షలు ఆయా పాఠశాలల్లో, సంస్థలోనే నిర్వహించబడునని రాఘవేంద్ర రావు తెలియ చేశారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ కోసం క్యూ ఆర్ కోడ్ ను సిద్ధం చేసినట్లు, స్కాన్ చేసి పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారి జి. నరసింహులు, స్వామి వివేకానంద యువజన సమితి కార్యదర్శి / క్విజ్ నిర్వాహకులు ఎస్. రాఘవేంద్ర రావు లు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News