జూలై 1 నుండి ఆగస్టు 31 వరకు డయేరియా నియంత్రణపై ప్రచార కార్యక్రమం

-రానున్న వర్షాకాలం దృష్ట్యా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలి
-డయేరియా కేసులు నమోదు కాకుండా తగిన కార్యాచరణ సిద్ధం చేయాలి
-కలెక్టరు మాధవీలత సిఎస్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
డయేరియా నియంత్రణపై ప్రజల్లో అవగాహన కలిగించేందుకు జూలై 1వ తేదీ నుండి ఆగస్టు 31 వరకు జిల్లా స్థాయిలో ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించాలని, జిల్లాలో ఒక్క డయేరియా కేసు నమోదు కాకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయం నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిరబ్ కుమార్ ప్రసాద్ సంబంధిత శాఖల అధికారులతో కలిసి, జిల్లా కలెక్టర్లు, వైద్య ఆరోగ్య ఇతర శాఖలతో వీడియో సమావేశం నిర్వహించారు. స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టరు, వైద్య అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్బంగా కలెక్టరు మాధవీలత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చేసిన ఆదేశాలపై సమీక్ష నిర్వహిస్తూ, డయేరియా పై ప్రజల్లో అవగాహన చైతన్యం కోసం ఇప్పటి వరకూ రెండు వారాల కార్యాచరణ అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈసారి రాష్ట్ర ప్రభుత్వం డయేరియా వల్ల ఒక్కరూ కూడా మృత్యువాత పడకుండా చేపట్టవలసిన చర్యలలో భాగంగా రెండు నెలల కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపారు. ఆమేరకు జిల్లా స్థాయిలో సూక్ష్మ స్థాయి ప్రణాళిక సిద్ధం చేసి నివేదిక అందచేయాలని కలెక్టరు మాధవీలత ఆదేశించారు. 5 ఏళ్ల లోపు చిన్నారులకు ఓ ఆర్ ఎస్ మరియు జింక్ సప్లిమెంటరీ అందచేయాలని పేర్కొన్నారు.  క్షేత్ర స్థాయిలో ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం ఐ ఈ సి (Information, Education & Communication) సమాచారం, అవగాహాన, ప్రచార కార్యక్రమాలు చేపట్టాలన్నారు. శానిటేషన్, పరిసరాల పరిశుభ్రత, శుద్ధమైన త్రాగునీరు, అనుబంధ శాఖల, స్వచ్ఛంద సంస్థలు భాగస్వామ్యం ద్వారా ప్రచార కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఆమేరకు మునిసిపల్, పంచాయతీ రాజ్, స్త్రీ శిశు సంక్షేమ, గ్రామీణ నీటి యాజమాన్య సంస్థ, విద్యా శాఖ సంయుక్త ఆధ్వర్యంలో సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాల్సి ఉందన్నారు. మలేరియా, డెంగ్యూ, తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించడం చాలా అవసరం అన్నారు.

వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ కె వేంకటేశ్వర రావు కమ్యూనిటీ స్థాయి కార్యకలాపాల వివరాలు తెలియ చేస్తూ, 5 ఏళ్లు లోపు చిన్నారులకు అవసరమైన ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లు, జింక్ మాత్రలు అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. వాటి వినియోగం పై వైద్య బృందాలు ఆధ్వర్యంలో డయేరీయ పై అవగాహాన ప్రచార కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో, సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక క్యాంపెయిన్ చెపట్టేందుకు  సమన్వయ శాఖల ఆధ్వర్యంలో చర్యలు తీసుకుంటామని తెలిపారు. అవసరమైన సందర్భంలో మెడికల్ క్యాంపులు నిర్వహించే విధంగా వైద్య సిబ్బందిని సన్నద్ధం చెయ్యానున్నట్లు తెలియ చేశారు.

ఈ సమావేశంలో డి ఎమ్ హెచ్ వో డా కె. వేంకటేశ్వర రావు డిసిహెచ్ఎస్ డా. ఎన్ పి పద్మశ్రీ  , డిఐఒ డా ఎన్. రాజ కుమారి, వైద్య ఆరోగ్య శాఖ డాక్టర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *