రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
మంగళవారం మధ్యాహ్నం స్ధానిక కాతేరు ఇసుక స్టాక్ పాయింట్ ను ఆర్డీవో ఏ. చైత్ర వర్షిణి ఇతర అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా దినేష్ కుమార్ మాట్లాడుతూ, కాతేరు ఇసుక స్టాక్ పాయింట్ వద్ద సుమారు 7 వేల మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులొ ఉందని, ప్రభుత్వ మార్గదర్శకాలు మేరకు వినియోగదారులకి పారదర్శకంగా ఇసుక పంపిణీ చేయాల్సి ఉందన్నారు. నియమ నిబంధనలు అతిక్రమిస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని దినేష్ కుమార్ హెచ్చరించారు. ఇంటి ప్లాన్ ప్రకారం అవసరమైన మేరకు మాత్రమే ఇసుక విడుదల చేయ్యాలని అన్నారు. గరిష్టంగా 20 మెట్రిక్ టన్నుల వరకూ మాత్రమే ఒక వ్యక్తికి ఒక రోజులో సరఫరా చేసేందుకు అవకాశం ఉందన్నారు. ఈ పర్యటనలో ఆర్డీవో ఏ. చైత్ర వర్షిణి, రాజమండ్రి రూరల్ తహసీల్దార్ వై వి కే అప్పారావు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News