మెడికల్ క్యాంపు ను ప్రారంభించిన మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ వన్ టౌన్ కేబీఎన్ కళాశాల ప్రాంగణంలో ఆదివారం ఉచిత మెడికల్ క్యాంపును మాజీమంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ప్రారంభించారు. స్వచ్ఛంద సంస్థల ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించటం సంతోషదాయకం అన్నారు. ఉచిత మెడికల్ క్యాంపు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సభ్యులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. వాసవి విజయవాడ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ మెడికల్ క్యాంపు పెద్ద ఎత్తున హాజరైన వృద్ధులు, మహిళలు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. పలు విభాగాలకు చెందిన అత్యుత్తమ వైద్య నిపుణులు వీరికి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. అంతకుముందు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావును వాసవి విజయవాడ క్లబ్ వారు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *