మునగాల రహదారి మార్గం తాత్కాలికంగా మూసివేత

-ట్రాఫిక్ శ్రీరంగపట్నం మీదుగా మళ్లింపు
-ఆర్ అండ్ బి ఈ ఈ – ఎస్ బి వి రెడ్డి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
కోరుకొండ నుండి ముగ్గళ్ల వెళ్ళు రహదారి లో కి. మీ 3/4 లో తోట కాలువ వద్ద మైనర్ వంతెన నిర్మాణములో వున్న దృష్ట్యా ట్రాఫిక్ డైవర్షన్ కొరకు గతంలో తాత్కాలిక రహదారి మార్గం ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా రోడ్డు భవనాల శాఖ అధికారి ఎస్బివి రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలియజేశారు. గత రెండు రోజుల నుండి కురిసిన భారీ వర్షాలకు తాత్కాలికముగా ఏర్పాటు చేసిన డైవర్షన్ రోడ్డు, ప్రవాహంలో కొట్టుకుని పోవడంతో తక్షణ రక్షణ చర్యల్లో భాగంగా కాపవరం మునగాల మధ్య రహదారి మూసివేయడం జరిగిందన్నారు. మునగాల నుండి కోరుకొండ , అదే విధంగా కోరుకొండ నుండి మునగాల వెళ్లే ట్రాఫిక్ శ్రీరంగపట్నం మీదుగా మళ్ళించడం జరుగుతున్నట్లు తెలిపారు. నీటి ప్రవాహం తగ్గిన వెంటనే డైవర్షన్ రోడ్డు ను నిర్మించి ట్రాఫిక్ ను యధావిధిగా పునరుద్ధిస్తామని ఆయన తెలియచేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *