-ప్రజల నుంచి అర్జిల స్వీకరణ
-జిల్లా, డివిజన్, మండల కేంద్రంలో అధికారులు హాజరు కావాలి
-కలెక్టర్ పి. ప్రశాంతి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జూలై 15 వ తేదీ సోమవారం నుంచి “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక “మీకోసం” ద్వారా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించ నున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదివారం ఒక ప్రకటనలో తెలియ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి, ప్రజల నుంచి అర్జీలు స్వీకరించే ప్రక్రియను “పబ్లిక్ గ్రివియన్స్ రెడ్రెస్సల్ సిస్టం (పి జి ఆర్ ఎస్)” మీకోసం ద్వారా చేపట్టనున్నట్లు తెలిపారు. “పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ (PGRS)” పోర్టల్ ద్వారా తమ సమస్యను నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయానికి తెలియజేయడానికి అనుమతిస్తుందని, ప్రజలు 1902 హెల్ప్‌లైన్‌కు కాల్ చేయవచ్చునని కలెక్టరు తెలియ చేశారు.
ఇందులో వ్యక్తిగత లేదా గృహ-స్థాయి ఫిర్యాదులను నమోదు చేయండి, నమోదిత ఫిర్యాదు యొక్క స్థితి గతులు తెలుసుకోవడం, ప్రభుత్వ సేవలు, పథకాల వివరాలు గురించి ఆరా తీయండి వంటి అంశాలను పోర్టల్ లో అనుసంధానం చేయనున్నట్లు తెలిపారు. జిల్లా స్థాయిలో కలెక్టరేట్ నందు, అదేవిధంగా డివిజన్, మునిసిపల్, మండల స్థాయి లో ఆయా ప్రధాన కార్యాలయాల్లో సంబంధిత శాఖల అధికారులు ప్రజలకి అందుబాటులో ఉండి ప్రజలు నుంచి అర్జీలు స్వీకరించనున్నట్లు తెలియ చేశారు. జిల్లా స్థాయిలో కలెక్టరేట్ లో కలెక్టరు, జాయింట్ కలెక్టర్, ఇతర అధికారులు హాజరు కానున్నట్లు కలెక్టర్ ప్రశాంతి తెలిపారు.
అదేవిధంగా డివిజన్ స్థాయి లో ఆర్డీవో, మునిసిపల్ స్థాయి లో కమిషనర్లు, మండల స్థాయి సంబంధిత అధికారులు ఒకే చోట అందుబాటులో ఉండి ప్రజలు నుంచి అర్జీలు స్వీకరిస్తారని తెలిపారు. జిల్లా కలెక్టర్, ఇతర జిల్లా అధికారులు ఉదయం 10.00 నుంచి మ.1.00 వరకు ఫిర్యాదులను కలెక్టరేట్ లో స్వీకరిస్తారని కలెక్టర్ తెలిపారు. అదే విధంగా రెవెన్యూ, మునిసిపల్, మండల కేంద్రంలో అర్జీలు అందచేయాలన్నారు.
ఉదయం 10 గంటల నుంచి మ.1.00 గంట వరకు అర్జీలు స్వీకరించడం జరుగు తుందని, కావున జిల్లా ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని విజ్ఞప్తి చేశారు. స్థానికంగా ఉండే అధికారులకి మీ అర్జిలను అందచేయాలని, జిల్లా కేంద్రానికి వొచ్చి వ్యయ ప్రయాసలకు గురుకావద్దని ఆ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.
Prajavartha Online Telugu News