రాజమహేంద్రవరం రూరల్, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా కలెక్టర్ ఆదేశాలు మేరకు సంక్షేమ వసతి గృహాలు, అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చెయ్యడం జరిగిందని రాజమహేంద్రవరం రూరల్ మండల ప్రత్యేక అధికారి) జిల్లా గిరిజన సంక్షేమ అధికారిణి కే ఎన్. జ్యోతి పేర్కొన్నారు. సోమవారం మధ్యాహ్నం ధవళేశ్వరం అంగన్వాడీ కేందాన్ని ఎంపిడివో డి. శ్రీనివాస్ తో కలిసి తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా కే. ఎన్ జ్యోతి వివరాలు తెలియా చేస్తూ, అంగన్వాడీ కేంద్రంలో గర్భిణీ లకు, చిన్నారులకు తాగేందుకు వేడి మంచినీళ్లు ఇవ్వడం, వేడిగా ఉన్న ఆహారం అందించాలని కలెక్టర్ స్పష్టం చేశారన్నారు. అందులో భాగంగా కేంద్రాన్ని పరిశీలించినట్లు తెలిపారు. ఈ కేంద్రంలో పారిశుధ్య నిర్వహణా, ఆహారం అందించే తీరును పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసినట్లు పేర్కొన్నారు. అనంతరం చిన్నారులతో ముచ్చటించి, అక్కడ పిల్లలకి అందచేస్తున్న ఆహారాన్ని రుచి చూడడం జరిగింది.
Prajavartha Online Telugu News