విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నగరంలోని గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీ ఆవరణలో ఉన్నటువంటి స్కిల్ హబ్ లో ఫోర్ వీలర్ సర్వీస్ టెక్నీషియన్ కోర్స్ నాల్గవ బ్యాచ్, డిజిటల్ మార్కెటింగ్ మూడవ బ్యాచ్ ను ప్రారంభించడం జరుగుతుందని, జూలై నెలలో ప్రారంభించే కోర్స్ కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా. జి. సృజన ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ నిరుద్యోగ యువత, విద్యార్థులకు ఇప్పటికే వివిధ రకాల ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ కోర్సుల ద్వారా ఉచిత శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో ఉన్నటువంటి వనరులు మరియు బహుళ జాతి కంపెనీ లో ఉన్నటువంటి ఉద్యోగ అవకాశాలను దృష్టిలో పెట్టుకొని యువతకి డిమాండ్ ఉన్నటువంటి కోర్సులో మూడు నెలల పాటు నైపుణ్య శిక్షణ కల్పించి వారిని స్థానికంగా, ఇతర రాష్ట్రాలలోని కంపెనీలలో ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతుందన్నారు. జిల్లాలోని ఆసక్తి ఉన్నటువంటి యువత వారి విద్యార్హతను బట్టి రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా కోరారు. దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 29వ తేదీ ఆఖరితేది అని అన్నారు.
అర్హతలు:
ఫోర్ వీలర్ సర్వీస్ టెక్నీషియన్ కోర్సు కు (8నుండి10వ తరగతి, ఐటిఐ, ఇంటర్మీడియట్ డిప్లమో అండ్ డిగ్రీ),
డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ కు ఇంటర్మీడియట్ నుండి డిగ్రీ వరకు అర్హత గా ఉందన్నారు.
ఇతర వివరాలకు 99857 59304, 80087 42842, 93477 79032 ఫోన్ నంబర్స్ ద్వారా తెలుసుకోవచ్చునని జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనను కోరారు.
Prajavartha Online Telugu News