ఆగస్ట్ 5 వ తేదీ సోమవారం “మీకోసం” ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహణ

-జిల్లా, డివిజన్, మున్సిపల్, మండల స్థాయిలో ప్రజల నుంచి అర్జిల స్వీకరణ
-కలెక్టర్ పి. ప్రశాంతి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఆగస్ట్ 5 వ తేదీ సోమవారం “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక  – “మీకోసం” ద్వారా కలెక్టరేట్ లో ప్రజల నుంచి అధికారులు అర్జీలు స్వీకరించ నున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదివారం ఒక ప్రకటనలో తెలియ చేశారు. ఆగస్ట్ 5 , 6 తేదీల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలెక్టర్ల తో అమరావతిలో నిర్వహిస్తున్న సమావేశం కు హాజరు కానున్న నేపథ్యంలో ఇంఛార్జి జాయింట్ కలెక్టర్ జి. నరసింహులు, ఇతర జిల్లా అధికారులు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించే ప్రక్రియను “పబ్లిక్ గ్రివియన్స్ రెడ్రెస్సల్ సిస్టం (పి జి ఆర్ ఎస్)” మీకోసం యధాతథంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లా స్థాయిలో కలెక్టరేట్ నందు, అదేవిధంగా డివిజన్, మునిసిపల్, మండల స్థాయి లో ఆయా ప్రధాన కార్యాలయాల్లో సంబంధిత శాఖల అధికారులు ప్రజలకి అందుబాటులో ఉండి ప్రజలు నుంచి అర్జీలు స్వీకరించనున్నట్లు తెలియ చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *