విద్యుత్ దీపాలతో శోభాయమానంగా ప్రకాశంబ్యారేజ్…కాంతులీనుతోన్న కృష్ణమ్మ

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త :
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ప్రకాశం బ్యారేజ్ ను రంగురంగుల విద్యుత్ దీపాలతో ఆకర్ష ణీయంగా తీర్చిదిద్దారు. దీంతో విద్యుత్ దీపకాంతులతో ప్రకాశం బ్యారేజ్ శోభాయమానంగా కనువిందు చేస్తూ సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. మరో వైపు విస్తారంగా కురుస్తున్న వర్షాల కారణంగా ఎగువప్రాంతాలనుండి వచ్చిచేరుతున్న వరదనీటితో నిండు కుండలా జలకళతో కృష్ణమ్మ కళకళలాడుతోంది. దీనికి తోడు బ్యారేజ్ పిల్లర్ లకు అమర్చిన రంగు రంగుల విద్యుత్ దీపాల కాంతలలో పరవళ్ళు త్రోక్కతూ ప్రవహిస్తున్న కృష్ణమ్మ సొగసులను వీక్షిస్తోన్న సందర్శకులు పరవశంతో ముగ్దులవుతోన్నారు.స్థానిక ప్రజల తో పాటు వివిధ ప్రాంతాల నుండి దుర్గమ్మ దర్శనార్ధం విజయవాడవచ్చే అశేష భక్తులు సైతం ఇంద్రధనస్సు ను చీరగా కట్టు కున్న రీతిగా రంగురంగులదీపకాంతులతో వెలుగొందుతున్న కృష్ణమ్మ ను చూసి సంబరపడుతున్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *