-ఆర్ బి ఐ స్థాపించి 90 సంవత్సరములు పూర్తయిన సందర్భంగా..
-దేశవ్యాప్తంగా ఆన్ లైన్ లో క్విజ్ పోటీలు నిర్వహిస్తుంది.
-సెప్టెంబర్ 17వ తేదీ లోపు విద్యార్థులకు ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
-ఆర్ బి ఐ పోస్టర్ ను ఆవిష్కరించిన..
-జిల్లా. కలెక్టరు పి. ప్రశాంతి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్థాపించి 90 సంవత్సరములు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా ఆన్ లైన్ లో క్విజ్ పోటీలు నిర్వహిస్తున్నారని, అందులో భాగంగా తూర్పుగోదావరి జిల్లాలో డిగ్రీ చదువుతున్న విద్యార్థిని, విద్యార్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ ను బుధవారం జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో కలెక్టర్ ప్రశాంతి, లీడ్ బ్యాంకు మేనేజర్ డీవీ.ప్రసాద్ , జిల్లా ఇంటర్మీడియట్ అధికారి జేవిఎల్ సుబ్రహ్మణ్యం తో కలసి పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ ఒక కళాశాల నుండి ఎంతమంది విద్యార్థులైనా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. అదేవిధంగా ఏ కళాశాల నుండైనా విద్యార్థులు పాల్గొనవచ్చని అన్నారు. ముందుగా కళాశాల పేరు https://www.rbi90quiz.in/ నందు రిజిస్టర్ కాబడినది, లేనిది చూసుకోవాలని, లేని యెడల రిజిస్టర్ చేసుకోవాలన్నారు. విద్యార్థులు ఒక టీమ్ గా ఏర్పడి క్విజ్ పోటీలలో రిజిస్టర్ చేసుకోవాలని, టీమ్ నందు కనీసం ఇద్దరు విద్యార్థులు ఉండేలా చూసుకోవాలన్నారు.
రాష్ట్ర స్థాయి రౌండ్ లో…
ప్రధమ బహుమతి..రు. 2 లక్షల రూపాయలు, ద్వితీయ బహుమతి..రు. 1లక్ష 50 వేల రూపాయలు,
తృతీయ బహుమతి..రు. 1లక్ష రూపాయలు,
జోనల్ స్థాయి రౌండ్ లో…
ప్రధమ బహుమతి.. రు. 5 లక్షలు ,
ద్వితీయ బహుమతి.. రు. 4 లక్షలు ,
తృతీయ బహుమతి.. రు. 3 లక్షలు.
జాతీయ స్థాయి ఫైనల్ రౌండ్ లో…
ప్రధమ బహుమతి.. రు. 10 లక్షలు , ద్వితీయ బహుమతి.. రు. 8 లక్షలు , తృతీయ బహుమతి.. రు. 6 లక్షలని విజేతలకు అందజేయడం జరుగు తుందన్నారు.
తూర్పుగోదావరి జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ డివి ప్రసాద్ మాట్లాడుతూ ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ లను సెప్టెంబర్ 17వ తేదీ లోపు చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. దరఖాస్తు రిజిస్ట్రేషన్ కొరకు ఎటువంటి రుసుమును చెల్లించిన అవసరం లేదని పూర్తి ఉచితమని తెలుపుతూ, ఈ అవకాశాన్ని డిగ్రీ చదివే విద్యార్థిని విద్యార్థులు వినియోగించు కోవాలని ఆకాంక్షించారు.
Prajavartha Online Telugu News