భారతీయ సంస్కృతి లో విద్య నేర్పించిన గురువులది ప్రథమ స్థానం..

-సమాజంలో ప్రతి ఒక్కరి విజయం వెనుక వారిని  తీర్చిదిద్దిన మహోన్నతమైన వ్యక్తి  టీచర్.
-70 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు
-జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
భారతీయ సంస్కృతిలో గురువు స్థానం ఎంతో విశిష్టమైనది, గౌరవప్రదమైనదని, ప్రతి ఒక్కరి విజయం వెనుక వారిని తీర్చిదిద్దిన మహోన్నతమైన వ్యక్తి  గురువు అని  జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి పేర్కొన్నారు.

గురువారం స్థానిక  శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో  నిర్వహించిన గురుపూజోత్సవ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అనపర్తి శాసనసభ్యులు రామకృష్ణారెడ్డి, అడిషనల్ ఎస్పీ ఏవి సుబ్బారావు, డీఈవో  ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా  కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ భారతీయ సంస్కృతిలో గురువు స్థానం ఎంతో విశిష్టమైనది, గౌరవప్రదమైనదని,  ప్రతి విద్యార్థి విజయం వెనుక ఉపాధ్యాయుల ప్రభావం ఎక్కువ ఉంటుందన్నారు. జిల్లా కలెక్టర్ కూతురైనా ఉపాధ్యాయులు చెప్పిందే పిల్లలు వింటారని అన్నారు. వ్యక్తి వ్యక్తిత్వాన్ని రూపొందించేవాడే టీచర్ అన్నారు. పిల్లల భవిష్యత్తును ముందుగా గుర్తించే వారు ఉపాధ్యాయులు మాత్రమే అన్నారు. విద్యార్థులు విద్యాభ్యాస సమయంలో క్రమశిక్షణతో కూడిన ఇచ్చిన అభ్యసిస్తూ లక్ష్యాలను చేరుకోవాలన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థుల్లో ఉన్న నైపుణ్యతను వెలికి తీసి వారిని ప్రతిభావంతులు గా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. చరిత్ర, ఇతిహాసాల్లో కూడా ప్రతి వ్యక్తి విజయం వెనుక వారిని ప్రేరేపించిన గురువుల ప్రధాన పాత్ర ఉంటుందని వారితోపాటు వారి గురువులను కూడా మనం గుర్తు చేసుకోవడం జరుగుతుందన్నారు.

ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి మాట్లాడుతూ భారతీయ సంస్కృతి లో గురువులది ఉన్నత స్థానం అన్నారు.

విద్యార్థుల్లో ఉత్తమ భావాలను పెంపొం దిస్తున్న గురువులను గౌరవించుకునే సంస్కృతి మన దేశం లోనే ఉందన్నారు. సమాజం లో గురువులది ఉన్నత స్థానం అన్నారు. ఉత్తమ ఉపాధ్యాయులు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

అడిషనల్ ఎస్. పి సుబ్బరాజు మాట్లాడుతూ టీచర్.. ఈ మూడు అక్షరాల పేర్లు ఎప్పటికీ మరచిపోలేమని, అప్పట్లో ఉపాధ్యాయుల మెప్పు పొందాలని, వారి మోము లో చిరునవ్వు చూడాలనే తపన తో పోటీ పడి చదివేవాళ్ళమని తన బాల్యాన్ని గుర్తు చేసుకున్నారు.

సమగ్ర శిక్షా అడిషనల్ ప్రాజెక్టు కో ఆర్డినేటర్ ఎస్. సుభాషిణి మాట్లాడుతూ.. తాను కూడా ఉపాధ్యాయిని గా పనిచేసి 2007లో గ్రూపు 1అధికారిగా జిల్లాలో పని చేయడం జరిగిందని, ఈ హోదా లో ఉన్నా.. తాను చదువుకున్న ప్రాధమిక పాఠశాల ఉపాధ్యాయులే ఇంకా గుర్తుంటారని, అదే ఉపాధ్యాయుని గొప్పదనం అన్నారు. ప్రభుత్వం తొలి ప్రాధాన్యత విద్య కే ఇస్తుందని, ఉపాధ్యాయులు అందరూ విద్యార్థుల్లో అభ్యసన ఫలితాలు మెరుగుపడేలా కృషిచేయాలన్నారు.

జిల్లా విద్యా శాఖ అధికారి కె. వాసుదేవరావు మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి నుండి భారత దేశ అత్యున్నత రాష్ట్రపతి పదవిని అలంకరించిన భారత రత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఆదర్శనీయులని అన్నారు. ఎవరు ఎంత ఎదిగినా.. తాను ఆస్థితికి చేరిన గురువునే తలుచుకుంటాడు.. కనుక సమాజం లో గురువు స్థితి అత్యున్నత మైనదని అన్నారు. సమాజంలో వ్యక్తులను ప్రభావితం చేసే వృత్తి ఉపాధ్యాయ వృత్తే అని.. ఈ రోజు అవార్డు అందుకుంటున్న ఉపాధ్యాయులు అందరికీ శుభాకాంక్షలు అన్నారు.

గురుపూజోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఈ సందర్భంగా 70 మందికి వివిధ కేటగరీ లలోని ఉపాధ్యాయులకు అవార్డు లు అందజేశారు.

ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

ఈ కార్యక్రమం లో జిల్లా విద్యాశాఖ ఎ డిలు వి. వెంకట్రాజు, ఎ.ఛాయా దేవి, డి వై ఈ వో నారాయణ, అర్బన్ రేంజ్ డి ఐ బి దిలీప్ కుమార్, రూరల్ ఎం ఈ వో తులసిదాస్, సమగ్ర శిక్షా ఎ ఎం వో గౌరీ శంకర్, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *