జిల్లాలో ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు

-కలెక్టరు పి. ప్రశాంతి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
వినాయక చవితి పండుగ సంధర్భంగా జిల్లా ప్రజలకి శుభాకాంక్షలు తెలియ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మట్టి గణపతి విగ్రహాలకు మాత్రమే పూజలు చేసి, పర్యావరణ పరిరక్షణ కోసం తమ వంతుగా ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని కోరారు. వినాయక చవితి పండుగ జరుకునే విధానంలో ప్రకృతిలో సహజంగా లభించే వాటితోనే పూజలు చేయడం పురాతనకాలం ఆచారంగా వస్తోందని పేర్కొన్నారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తదితర నీటిలో కరగని వాటిని ఉపయోగించి తయారు చేసిన విగ్రహాలను పూజలలో వినియోగించ వద్దని విజ్ఞప్తి చేశారు. ప్రజలకి, సాధారణ ట్రాఫిక్ కు ఎటువంటి అంతరాయం ఏర్పడకుండా జిల్లా, పోలీసు యంత్రాంగం సూచనలను పాటించాలన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *